AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ భార్య, పిల్లల ముందు ఈ మాటలు అసలే వద్దు! ఎందుకో తెలుసా?

కుటుంబ జీవనం సజావుగా సాగడానికి చాణక్యుడు అనేక సూచనలు చేశారు. కుటుంబంలోని భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు.. ప్రతి ఒక్కరి ప్రవర్తన మరియు బాధ్యతలను ఆయన స్పష్టంగా వివరించారు. భార్య, పిల్లల ముందు కుటుంబ పెద్ద మాట్లాడకూడని విషయాల గురించి వివరించారు.

Chanakya Niti: మీ భార్య, పిల్లల ముందు ఈ మాటలు అసలే వద్దు! ఎందుకో తెలుసా?
Chanakya
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 1:14 PM

Share

భారత అర్థశాస్త్ర, నీతి శాస్త్ర పితాహుడిగా ప్రసిద్ధికెక్కిన ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలోనే అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. ఆయన చెప్పిన విషయాలు నేటి మానవ జీవితంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కుటుంబ జీవితం సజావుగా సాగేందుకు ఆయన అనేక సూచనలు చేశారు. కుటుంబంలో భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు ఇలా ప్రతీ ఒక్కరి ప్రవర్తన, బాధ్యతల గురించి స్పష్టంగా తెలియజేశారు.

కుటుంబం అనే రథానికి భార్యాభర్తలు రెండు ప్రధాన చక్రాలు అని చాణక్యుడు చెప్పారు. ఈ రెండు చక్రాలు ఒకే వేగంతో నడుస్తున్నంత కాలం రథం సజావుగా సాగుతుందన్నారు. ఈ చక్రాలలో ఒకటి ముందుకు వెనుకకు కదిలినా లేదా విరిగిపోయినా.. ఈ రథం ముందుకు కదలదు. కాబట్టి భార్యభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. భర్త డబ్బు సంపాదిస్తే.. భార్య ఇంట్లో కష్టపడి పనిచేస్తుందని గుర్తించాలి. ఆమె తన పిల్లలలో విలువలను పెంపొందించే పని చేస్తుందని చాణక్యుడు తన నీతి పుస్తకంలో పేర్కొన్నారు. అందుకే భార్య, పిల్లల ముందు భర్త మాట్లాడకూడని వాటి గురించి ఆయన తెలియజేశారు.

దుర్బాషలు: మీ ఇంట్లో మూడో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు.. మీ కుటుంబం, భార్య, పిల్లల ముందు అతని గురించి ఎప్పుడూ దుర్భాషలాడకూడదని చాణక్యుడు చెప్పారు. ఇది ఇంటి యజమాని విధి అని అన్నారు. ఎందుకంటే ఇది మీ పిల్లలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలియజేశారు.

భార్యను గౌరవించడం: సంతోషకరమైన జీవితం కోసం మీరు ఎప్పుడూ మీ భార్యను గౌరవించాలని చాణక్యుడు స్పష్టం చేశారు. ఎందుకంటే మీ భార్య ఇంట్లో ఏమీ ఆశించకుండా మీ జీవితాన్ని సంతోషపరిచే ఏకైక వ్యక్తి. అందుకే మీరు మీ భార్యపై కోపంగా ఉన్నప్పుడు ఆమె గురించి దుర్భాషలాడటం, ఆమెను అవమానించడం చేయొద్దు.

భార్య కుటుంబం పట్ల గౌరవం: మీ పిల్లల ముందు మీ భార్య గురించి లేదా ఆమె కుటుంబం గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడవద్దని చాణక్యుడు చెప్పారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒక భార్య ఏదైనా సహించగలదు కానీ.. ఆమె కుటుంబం పట్ల దుర్భాషను ఉపయోగించినప్పుడు లేదా ఆమె కుటుంబ సభ్యులను అగౌరవపర్చడాన్ని ఎప్పుడూ సహించదు. కాబట్టి ఆమె కుటుంబం గురించి కానీ, ఆమె కుటుంబం ముందు మీ భార్య గురించి గానీ ఎప్పుడూ చెడుగా మాట్లాడవద్దు అని సూచించారు.

ప్రతికూల మాటలు: మీ భార్య లేదా పిల్లల ముందు ప్రతికూలమైన మాటలు మాట్లాడవద్దని చాణక్యుడు సూచించారు. ఇది మీ ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని హెచ్చరించారు. ఇంట్లో కుటుంబ పెద్దలు ఎప్పుడూ సానుకూలతను కాపాడే విషయాలను చెప్పాలని సూచించారు.