Roasted Chickpeas Benefits: సాయంత్రం స్నాక్స్‌గా ఆరోగ్యానికి హానిచేసే జంక్ ఫుడ్‌కు బదులుగా వేయించిన శనగలు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్, రక్త చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, రోగనిరోధక శక్తిని, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అయితే, రోజుకు 100 గ్రాములకు మించి తీసుకోరాదు.