వేడి వేడిగా, కారం కారంగా.. నాటు కోడి కూర ఇలా వండితే అదిరిపోద్దీ!

Samatha

3 January 2026

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అందులో చాలా మంది నాటు కోడి కూర తినడానికి ఇష్టపడుతుంటారు.

చికెన్ కర్రీ

కాగా ఇప్పుడు మనం వేడిగా, టేస్టీగా, కారం కారంగా నాటు కోడి కూర ఇంటిలోనే సులభంగా ఎలా వండుకోవాలో చూసేద్దాం పదండి.

ఇంట్లోనే ఎలా వండాలంటే?

కావాల్సిన పదార్థాలు : అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పూదీన,మసాల దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ,పెరుగు, సరిపడ ఆయిల్.

కావాల్సిన పదార్థాలు

ముందుగా నాటు కోడిని శుభ్రం చేసి, మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త పసుపు, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి మరో సారి గోరు వెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి.

కోడి శుభ్రం

తర్వాత దీనిని  వేరే బౌల్ లోకి తీసుకొని అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పస్ట్ , ఆనియన్ పేస్ట్, పెరుగు వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

నాటు కోడి కూర 

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి, అందులో నూనె పోసి, మసాల దినుసులు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , పూదీన రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వేసుకొని మరోసారి వేయించుకోవాలి.

 నాటు కోడి కూర ప్రిపేర్

ఇవి కాస్త వేగాక, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని, మంచిగా కలుపుకోవాలి. తర్వాత పదినిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి.

చికెన్ వేగనివ్వడం

తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ పోసి, మరోసారి మెత్తగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా, పూదీన రెబ్బలు వేసి మరో పదినిమిషాలు ఉండనివ్వాలి.

చికెన్ ఉడకడం

ఇక చికెన్ ఉడికిపోతుంది. అప్పుడు కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు స్టవ్ పై ఉంచి, తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడి వేడి కారం కారం నాటు కోడి కూర రెడీ.

నాటు కోడి కూర రెడీ