Dragon Fruit for Babies: పిల్లలకు డ్రాగన్ ప్రూట్ పెట్టొచ్చా.. ఇక్కడున్న విషయాలు మీ కోసమే!

పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండటం కోసం పోషకాహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు త్వరగా ఎటాక్ చేయకుండా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాలను పట్టడం మానేసిన దగ్గర నుంచి పిల్లలకు పండ్లను, కూరగాయలను తప్పనిసరిగా అందించాలి. అప్పుడే వారు పుష్టిగా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి బల పడుతుంది. త్వరగా నీరసించి పోకుండా.. రోగాల బారిన పడకుండా ఉంటారు. పిల్లలకు పెట్టే ఆహారంలో మీరు డ్రాగన్ ఫ్రూట్..

Dragon Fruit for Babies: పిల్లలకు డ్రాగన్ ప్రూట్ పెట్టొచ్చా.. ఇక్కడున్న విషయాలు మీ కోసమే!
Dragon Fruit
Follow us
Chinni Enni

|

Updated on: Sep 10, 2024 | 4:51 PM

పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండటం కోసం పోషకాహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు త్వరగా ఎటాక్ చేయకుండా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాలను పట్టడం మానేసిన దగ్గర నుంచి పిల్లలకు పండ్లను, కూరగాయలను తప్పనిసరిగా అందించాలి. అప్పుడే వారు పుష్టిగా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి బల పడుతుంది. త్వరగా నీరసించి పోకుండా.. రోగాల బారిన పడకుండా ఉంటారు. పిల్లలకు పెట్టే ఆహారంలో మీరు డ్రాగన్ ఫ్రూట్ కూడా చేర్చవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారు. మరి పిల్లలకు డ్రాగ్ ఫ్రూట్ పెట్టవచ్చా? పెడితే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

విటమిన్ సి మెండుగా:

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలంగా మారుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు విటమిన్ సి అనేది చాలా అవసరం. త్వరగా రోగాలు ఎటాక్ చేయకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది:

డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయ పడుతుంది. ముఖ్యంగా శిశువులలో ఉండే మలబద్ధకాన్ని నివారిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ:

డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి పిల్లల్లో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వారి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి.

స్కిన్ అలెర్జీలను తగ్గిస్తుంది:

పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ తినిపించడం వల్ల పిల్లలో వచ్చే చర్మ అలర్జీలను తగ్గించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల చర్మానికి రక్షణగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..