Tips for Brain Sharp: ఇలా చేశారంటే మీ బ్రెయిన్‌ని షార్ప్ అవుతుంది..
మన శరీరం మొత్తం మెదడు కంట్రోల్‌పై ఆధార పడి ఉంటుంది. మెదడు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో.. శరీరం అలా పని చేస్తుంది. బ్రెయిన్ ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉండాలంటే మిగతా జీవక్రియలన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏ వస్తువు అయినా తరచూ పని చేస్తే.. ఎలా రిపేర్స్ వస్తాయో.. మెదడుకు కూడా అంతే. మెదడు బలహీన పడే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గి మతి మరుపు ఏర్పడుతుంది. అంతే కాకుండా ఇతర పనులన్నీ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. మళ్లీ మెదడును దారిలో..
మన శరీరం మొత్తం మెదడు కంట్రోల్‌పై ఆధార పడి ఉంటుంది. మెదడు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో.. శరీరం అలా పని చేస్తుంది. బ్రెయిన్ ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉండాలంటే మిగతా జీవక్రియలన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏ వస్తువు అయినా తరచూ పని చేస్తే.. ఎలా రిపేర్స్ వస్తాయో.. మెదడుకు కూడా అంతే. మెదడు బలహీన పడే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గి మతి మరుపు ఏర్పడుతుంది. అంతే కాకుండా ఇతర పనులన్నీ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. మళ్లీ మెదడును దారిలో పెట్టేందుకు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే మందులతో పని లేకుండా కొన్ని రకాల పనులు తరచూ చేస్తూ ఉంటే మాత్రం ఈజీగా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మరి మెదడు పని తీరును మెరుగు పరిచే చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడిటేషన్ చేయండి:
మనిషి అనేక భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాడు. ఇవి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. బ్రెయిన్ పని తీరును నెమ్మదించడం, స్పందించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెనకబడుతుంది. కాబట్టి మెడిటేషన్ చేయడం వల్ల ఇవన్నీ అదుపులో ఉంటాయి. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. దీంతో మెదడు కణాలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి.
మంచి నిద్ర:
బ్రెయిన్ షార్ప్‌గా పని చేయాలంటే తగినంత నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర సరిగా లేకపోతే బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి బ్రెయిన్ సరిగా పనిచేయాలంటే నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర పోవడం వల్ల మెదడు పని తీరు అనేది మెరుగు పడుతుంది.
బుక్స్ చదవడం:
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెయిన్‌కి కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. మీకు ఎంతో ఇష్టమైన పుస్తకాలు చదవడం వల్ల చాలా వరకు సంతోషంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి.
స్క్రీన్ టైమ్ తగ్గించాలి:
ప్రస్తుత కాలంలో అందరూ మొబైల్స్, కంప్యూటర్లపై పని చేస్తున్నారు. దీని వల్ల ఫోకస్ అనేది తగ్గుతుంది. బ్రెయిన్ సరిగా పని చేసేందుకు తగిన సమయం ఉండం లేదు. దీని వల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా పడుతుంది. కాబట్టి స్క్రీనింగ్ సమయం తగ్గించాలి.
పజిల్స్ ఆడుతూ ఉండాలి:
బ్రెయిన్ షార్ప్ చేయాలంటే.. పజిల్స్ చాలా ముఖ్యం. వీటి వలన బ్రెయిన్ రిపేర్ అవుతుంది. తనంతట తాను సరిగా పనిచేయాలంటే పజిల్స్ అనేవి ఆడుతూ ఉండాలి. ఇవి బ్రెయిన్‌కి వ్యాయామంగా ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..