Sugar Foods: షుగర్ ఆహారాలు తినడం మానేస్తే శరీరంలో జరిగేది ఇదే!

ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. షుగర్ అంటే ఒక కార్బోహైడ్రేట్. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీ శరీరం జోడించిన చక్కెరను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మీ శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. వివిధ రకాల చక్కెరలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని సహజంగా కొన్ని పండ్లు, పాల ఉత్పత్తులలో..

Sugar Foods: షుగర్ ఆహారాలు తినడం మానేస్తే శరీరంలో జరిగేది ఇదే!
Sugar
Follow us
Chinni Enni

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 12, 2024 | 7:18 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. షుగర్ అంటే ఒక కార్బోహైడ్రేట్. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీ శరీరం జోడించిన చక్కెరను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మీ శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. వివిధ రకాల చక్కెరలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని సహజంగా కొన్ని పండ్లు, పాల ఉత్పత్తులలో లభిస్తాయి. అయినప్పటికీ.. జోడించిన చక్కెరలు అని పిలువబడే కొన్ని రకాలు ఉన్నాయి. అప్పుడు మీ ఆహారంలో చేర్చినప్పుడు మీ ఆరోగ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేయవచ్చు. చక్కెర శాతం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల బరువు పెరగడం, డయాబెటీస్ వంటివి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రోజుల పాటు షుగర్ ఉన్న ఆహార పదార్థాలు తినక పోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు:

చక్కెర ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేయడం వల్ల గణనీయంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే చక్కెర ఉన్న ఆహారాల్లో క్యాలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వలన బరువు పెరుగుతారు. ఇవి అతిగా తినడానికి దారి చేస్తుంది.

శక్తి పెరుగుతుంది:

చక్కెర ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. చక్కెర తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థిరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెరుగైన చర్మం:

అధిక చక్కెర తీసుకోవడం వల్ల మొటిమలు, రోసేసియా వంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. చర్మంపై వాపు సమస్యలు కూడా వస్తాయి. మీరు చక్కెర తీసుకోవడం తగ్గించినప్పుడు.. చర్మం సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

గుండె పనితీరు మెరుగు:

చక్కెర తక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల గుండె పని తీరు మెరుగు పడుతుంది. ఎందుకంటే చక్కెర పదార్థాలు తినడం తగ్గించినప్పుడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేది తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులకు దారి తీసే పరిస్థితులు తగ్గుతాయి.

మెరుగైన దంత ఆరోగ్యం:

చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కావిటీస్, దంత క్షయం, ఇతర పళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చక్కెర పదార్థాలు తినడం మానేస్తే దంత ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇంకా గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎటాక్ చేయకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..