Banana: రోజూ అరటి పండు తింటే.. 30 రోజుల్లో ఏమవుతుందో తెలుసా.?

అరటిపండులో  కేలరీలు  కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఒక అరటి పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి...

Banana: రోజూ అరటి పండు తింటే.. 30 రోజుల్లో ఏమవుతుందో తెలుసా.?
Banana
Follow us

|

Updated on: Sep 10, 2024 | 4:41 PM

కాలంతో సంబంధం లేకుండా తక్కువ ధరలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ప్రతీరోజూ అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కనీసం ఒక అరటి పండు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.

అరటిపండులో  కేలరీలు  కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఒక అరటి పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా అరటి పండును తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రతీరోజూ క్రమంతప్పకుండా అరటి పండును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిలోని ఫైబర్‌ కంటెంట్‌ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

* అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా రోజూ అరటి పండు తింటే బీపీ అదుపులోకి వస్తుంది.

* కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా అరటి బాగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఒక అరటి పండును తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగువుతంది. ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.

* ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఒక అరటిని పండును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఎ, ఫోలేట్ శరీరం తరచూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

* ఎముకలు బలంగా మారడంలో కూడా అరటిపండు ఉపయోగపడుతుంది. అరటిపండులోని మెగ్నీషియం, క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటిపండును పాలలో కలుపుకొని తీసుకంటే మరింత మంచి జరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..