AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా మామిడిపండ్లను తినొచ్చా…ఒక వేళ తింటే ప్రమాదమా…అసలు విషయం తెలుసుకోండి..

వేసవికాలం వచ్చింది అంటే మామిడి పండ్లు మనల్ని ఎంతో నోరూరిస్తూ ఉంటాయి. . ఈ సీజన్లో మామిడి పండ్లను తినేందుకు పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా మామిడిపండ్లను తినొచ్చా...ఒక వేళ తింటే ప్రమాదమా...అసలు విషయం తెలుసుకోండి..
Mangoes
Madhavi
| Edited By: |

Updated on: May 02, 2023 | 9:55 AM

Share

వేసవికాలం వచ్చింది అంటే మామిడి పండ్లు మనల్ని ఎంతో నోరూరిస్తూ ఉంటాయి. . ఈ సీజన్లో మామిడి పండ్లను తినేందుకు పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మామిడిపళ్ళలో ఉండే పోషకాలు కూడా మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. మరి అలాంటి మామిడి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చా లేదా అనే సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పొద్దున్నే పరగడుపునే నిద్రలేచిన అనంతరం ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది తప్పనిసరి. లేకపోతే మీ రోజంతా నీరసంగా ఉండటం సహజం. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఉదయాన మామిడి పండ్లను తినవచ్చా అనే సందేహం కలగవచ్చు. కానీ ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మామిడి పండు తో పాటు మరేదైనా ఇతర అల్పాహారాన్ని కూడా చేర్చుకొని తిన్నట్లయితే అప్పుడు ఏమి కాదని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఒక గంట తర్వాత మామిడి పండ్లను తిన్నట్లయితే అందులోని పూర్తి పోషకాలు మీ శరీరానికి అందే అవకాశం ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.

మన శరీరం రాత్రంతా నిద్రపోయి ప్రొద్దున లేచేసరికి కడుపులో పేగులు ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో పేగులు కొన్ని యాసిడ్స్ ను విడుదల చేస్తూ ఉంటాయి. . అప్పుడే మనం అల్పాహారం చేసినట్లయితే మన శరీరానికి కావాల్సిన పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి అందుకే బ్రేక్ ఫాస్ట్ అనేది తప్పనిసరి అని చెబుతుంటారు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంటే కోడిగుడ్లు, ఇడ్లీలు, బ్రెడ్, చికెన్, మటన్ తో చేసిన వంటకాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉదయాన్నే లేవగానే పండ్లను తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఎందుకంటే పండ్లలో అసిడిక్ నేచర్ అనేది ఉంటుంది అంటే ఆమ్లతత్వాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఉదయాన్నే మీ కడుపులో పేగుల్లో ఆమ్లాలు విడుదలై ఉంటాయి. . వాటికి మామిడిపండు రసంలోని ఆమ్లాలు కూడా తోడైతే ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

అలాగే మామిడి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం తీసుకున్నట్లయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా మామిడి పండ్లను తీసుకున్నట్లయితే మంచిదని చెబుతున్నారు. అయితే మీరు మామిడి పండ్లను ముక్కలుగా మాత్రమే కాకుండా వాటిని స్మూతీలుగాను లస్సిగాను చేసుకొని తిన్నట్లయితే మరింత మంచిదని చెబుతున్నారు.

మామిడిపండ్ల రసాల్లో అనేక పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా మామిడిపండ్లలో విటమిన్ సి, ఫాస్పరస్, మెగ్నీషియం వాటి పోషకాలు ఉన్నాయి. అందుకే వేసవిలో లభించే మామిడి పండ్లను తినమని డైటీషియన్లు చెబుతూ ఉంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం మామిడిపండు విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. . ముఖ్యంగా మామిడి పండ్లను లిమిటెడ్ గా తీసుకున్నట్లయితే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..