AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health: మహిళలూ బీ అలెర్ట్.. శరీరంలో ఇది లోపిస్తే పెను ప్రమాదమేనట..

ప్రస్తుత కాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో మహిళలు వారి ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చాలా సార్లు మహిళలు ఇంటి, కుటుంబ బాధ్యతల భారంలో చిక్కుకోవడం ద్వారా వారి ఆరోగ్యంపై దృష్టి సారించరు..

Women's Health: మహిళలూ బీ అలెర్ట్.. శరీరంలో ఇది లోపిస్తే పెను ప్రమాదమేనట..
Womens Health
Shaik Madar Saheb
|

Updated on: May 02, 2023 | 9:10 AM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో మహిళలు వారి ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చాలా సార్లు మహిళలు ఇంటి, కుటుంబ బాధ్యతల భారంలో చిక్కుకోవడం ద్వారా వారి ఆరోగ్యంపై దృష్టి సారించరు.. అయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు కొన్ని పోషకాలు చాలా ముఖ్యమైనవి. అవి లోపిస్తే మహిళలకు కొన్ని సమస్యల బారిన పడతారు. వ్యాధులతోపాటు శరీర బలహీనతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పోషకాలలో ఒకటి విటమిన్ డి ఒకటి.. మహిళల్లో విటమిన్ డీ లోపం ఉండకూడదు. ఈ లోపం ఉంటే.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఎముక నొప్పి, కీళ్ల నొప్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం లక్షణాలు

ఎక్కువగా జబ్బుల బారిన పడటం.. శరీరంలో విటమిన్ డి తక్కువ మొత్తంలో ఉన్న స్త్రీలు, వారి రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. నిరంతరం వారు అనారోగ్యంతో బాధపడుతుంటారు. మీ శరీరంలో ఉండే విటమిన్ డి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలసట.. విటమిన్ డి లోపం మహిళలకు రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టతరం చేస్తుంది. తరచుగా వారు అలసట, బలహీనతను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

టెన్షన్.. మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి విటమిన్ డి పనిచేస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహిళలు మానసికంగా సున్నితంగా పరిగణించబడతారు. కావున వారు తప్పనిసరిగా ఈ విటమిన్‌ను పొందాలి. లేకుంటే వారు టెన్షన్, డిప్రెషన్‌కు గురవుతారు.

ఎముకలలో బలహీనత.. క్యాల్షియం, విటమిన్ డి కూడా ఎముకల బలానికి కారణమని భావిస్తారు. ఈ విటమిన్ తగినంత మొత్తంలో మహిళల శరీరానికి చేరకపోతే, వారి ఎముకలు బలహీనంగా మారుతాయి. వారిలో చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది.

విటమిన్ డి పొందడానికి ఏమి చేయాలి..

సూర్యరశ్మి ద్వారా శరీరానికి లభించే విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. రోజూ 10 నుంచి 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉంటే మీకు లోటు ఉండదు. అయినప్పటికీ, విటమిన్ డి పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలు, పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!