గర్భిణీల్లో ఈ మూడు సమస్యలు చాలా కామన్, అయినప్పటికీ ఈ పరిష్కారాలు మీ కోసం..
ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది ముఖ్యమైన ఘట్టం. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది ముఖ్యమైన ఘట్టం. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు ఆహారం విషయంలోనూ మానసిక ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి నెల నుంచి డెలివరీ అయ్యే వరకు శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. ఈ మార్పులు రావడం ద్వారా మహిళ శరీరంలో కొన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్ సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ చాలామంది మహిళల్లో సమస్యలు సృష్టిస్తుంది. అలాగే ఇతర హార్మోన్లు సైతం స్త్రీ శరీరంలో గణనీయమైన మార్పులకు గురి చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ప్రధానమైన మార్పులు అదేవిధంగా ఇంటి చిట్కాలను కూడా మనం తెలుసుకుందాం.
స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు మొత్తం తొమ్మిది నెలల పాటు గర్భస్థ పిండాన్ని మోస్తుంది. దీనిని 3 మూడు త్రైమాసికాలుగా విభజిస్తారు. మొదటి త్రైమాసికంలో పిండం ఏర్పడటంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల ప్రారంభమవుతుంది. మూడవ నెల నుంచి ఆరవ నెల వరకు బిడ్డ ఎదగడం ప్రారంభిస్తుంది. చివరి మూడు నెలల్లో పిండం పూర్తిస్థాయిలో బిడ్డగా ఎదుగుతుంది అంటే డెలివరీకి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో శరీరంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు కొన్ని లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
వాంతులు అవడం:
మొదటి మూడు నెలలపాటు వాంతులు అవడం సహజం. సహజంగానే శరీరంలో పిండం ఎదిగే క్రమంలో, కడుపులో వికారం కలిగే అవకాశం ఉంది. దీంతో చాలామందిలో వాంతులు కలగడం మనం చూస్తూనే ఉంటాం.దీనినే మార్నింగ్ సిక్‌నెస్ అని కూడా అంటారు. ఉదయం చాలా తీవ్రంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మార్నింగ్ సిక్నెస్ రావచ్చు. ఒత్తిడి, ప్రయాణం, వేడి లేదా కొవ్వు పదార్ధాల వంటి నిర్దిష్ట ఆహారాల వల్ల మార్నింగ్ సిక్‌నెస్ తీవ్రమవుతుంది. కొంచం కొంచం ఆహారం తీసుకోవడం ద్వారా ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. అధిక-ప్రోటీన్, కాంప్లెక్స్-కార్బోహైడ్రేట్ ఆహారం అయిన గోధుమ రొట్టె, పాస్తా, అరటిపండ్లు, ఆకు కూరలు వంటివి వికారం తగ్గించడంలో సహాయపడవచ్చు.
వెన్నునొప్పి:
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ బరువు పెరుగుదలను నియంత్రించండి. వెన్ను నొప్పిల లేచినప్పుడు పెయిన్ కిల్లర్‌లను ఉపయోగించకుండా వీపుపై హీటింగ్ ప్యాడ్‌ని ఉపయోగించండి. పొత్తికడుపు కండరాల బలపరిచే వ్యాయామాలు కూడా వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.గర్భిణీలు హై హీల్స్ చెప్పులు వాడటం మానుకోండి. ఎక్కువ సేపు నిలబడకండి. నిద్రించడానికి గట్టి పరుపును ఎంచుకోండి. నిద్రించే పొజిషన్ లో మార్పులు చేసుకోండి.
తరచూ మూత్రవిసర్జన:
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మీ శరీరం అధిక ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది మీ మూత్రపిండాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు దీన్ని మీ మూత్రాశయం మీద నెట్టడం అభివృద్ధి చెందుతున్న గర్భాశయంతో కలిపినప్పుడు, మీరు సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవుతుంది. అయితే రాత్రిపూట బాత్రూం అటాచ్డ్ ఉన్న బెడ్రూంలో పడుకునేలా జాగ్రత్త పడండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం






