Microsoft Edge: డేంజర్ జోన్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులు.. హై రిస్క్ అంటూ హెచ్చరించిన ప్రభుత్వం.. వివరాలు ఇవి..

ఇటీవల భారత ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులు జాగ్రత్త పడాలని సూచించింది. లేకుంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది

Microsoft Edge: డేంజర్ జోన్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులు.. హై రిస్క్ అంటూ హెచ్చరించిన ప్రభుత్వం.. వివరాలు ఇవి..
Microsoft Edge
Follow us
Madhu

|

Updated on: Feb 09, 2023 | 3:00 PM

ఇంటర్ నెట్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. అన్ని వ్యవస్థలు డిజిటలీకరణ చెందుతున్న క్రమంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం ఆన్ లైన్ లో ఎంటర్ చేయాల్సిన పరిస్థితి. మన వినియోగించే బ్రౌజర్లలో ఇవి నిక్షిప్తం అయ్యి ఉంటాయి. అంటే బ్యాంకింగ్ వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారం మన వినియోగించే బ్రౌజర్లలో సేవ్ అవుతాయి. అటువంటప్పుడు ఆ బ్రౌజర్ లో డేటాను భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్రౌజర్ నిర్వాహకులపై ఉంటుంది. మనం ఎక్కువగా గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి పాపులర్ వెబ్ బ్రౌజర్లను వినియోగిస్తుంటాం. అయితే ఇటీవల భారత ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులు జాగ్రత్త పడాలని సూచించింది. లేకుంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అది ఎందుకు? అసలు విషయం ఏంటి? ఓసారి చూద్దాం..

పాత వెర్షన్లను వినియోగించడంతో సమస్య..

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి. ఇది గూగుల్ క్రోమ్ తర్వాత ఎక్కువ మంది వినియోగిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా, టెక్ దిగ్గజం సృజనాత్మక పాప్-అప్‌లు, కొత్త డిజైన్, ఫీచర్‌లతో విండోస్ వినియోగదారులకు విశేష అనుభవాన్ని అందిస్తోంది. వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి, మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ కోసం భద్రతా పరమైన చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్లను విడుదల చేస్తుంది. అయితే కొంత మంది వినియోగదారులను ఈ సిఫార్సులను పట్టించుకోకుండా పాత వెర్షన్‌లనే వినియోగిస్తున్నారు. దీంతో ఇది హ్యాకర్లకు వరంలా మారుతోంది.

భారత ప్రభుత్వ హెచ్చరిక..

ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ వినియోగదారులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఒక ప్రమాదకరమైన సాంకేతిక లోపం (Vulnerability) ఉన్నట్లు తెలిపింది. ఈ లోపం ద్వారా రిమోట్ అటాకర్‌ లేదా హ్యాకర్ యూజర్ కంప్యూటర్‌కు యాక్సెస్‌ను సులభంగా పొంది దానిని కంట్రోల్ చేయగలుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సెక్యూరిటీ సమస్య 109.0.1518.78 ముందు ఎడ్జ్ వెర్షన్లు వాడుతున్న వారిని ప్రమాదంలో పడి వేస్తుందని వివరించింది. CERT-In తాజా పోస్ట్‌లో ఈ విషయం గురించి చాలా వివరంగా తెలిపింది. ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోని ఆ లోపాన్ని ఉపయోగించుకోగలిగితే, వారు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్‌ను పొందగలరని, టర్న్ ఆన్ చేసి ఉన్న ఎలాంటి సెక్యూరిటీస్‌నైనా దాటవేయగలరని తెలిపింది. తద్వారా యూజర్ల పర్సనల్ సమాచారం దొంగిలించడానికి లేదా యూజర్లపై నిఘా పెట్టడానికి వీలవుతుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోని ఈ లోపం యూజర్ల కంప్యూటర్‌కు ప్రత్యేక రకమైన రిక్వెస్ట్‌ను పంపడానికి హ్యాకర్లకు మార్గం సుగమనం కూడా చేస్తుందని CERT-IN పేర్కొంది. దాని ద్వారా హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడం సులువు అవుతుంది.

ఇవి కూడా చదవండి

అప్ డేట్ ఒక్కటే పరిష్కారం..

ఈ సమస్య చాలా పెద్దది. కాబట్టి దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రమే ఫిక్స్ చేయగలదు. కాగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ లోపాన్ని ఫిక్స్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ యూజర్లు ఈ కొత్త వెర్షన్‌కు తమ ఎడ్జ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. మీ సిస్టమ్‌లో న్యూ అప్‌డేట్ అందుబాటులో ఉంటే అప్‌డేట్ ప్రాంప్ట్ పొందుతారు. లేదంటే కొత్త అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు. అందుకు బ్రౌజర్ టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సెట్టింగ్స్‌కి వెళ్లి అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (About Microsoft Edge) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం బ్రౌజర్‌ను రీలాంచ్ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?