WhatsApp new update: మీ ‘స్టేటస్’కు మరిన్ని హంగులు.. ఏకంగా ఐదు కొత్త ఫీచర్లతో వాట్సాప్ కొత్త అప్ డేట్..

ఇప్పటి వరకు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ కింద ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక మీదట వాయిస్ మెస్సేజ్ లను సైతం స్టేటస్ కింద పెట్టుకోవచ్చు.

WhatsApp new update: మీ ‘స్టేటస్’కు మరిన్ని హంగులు.. ఏకంగా ఐదు కొత్త ఫీచర్లతో వాట్సాప్ కొత్త అప్ డేట్..
Whatsapp
Follow us
Madhu

|

Updated on: Feb 09, 2023 | 12:09 PM

సోషల్ మీడియాలో వాట్సాప్ ఓ ప్రభంజనం.. వినియోగదారులకు ఏది అవసరమో దానిని గ్రహించి ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. అందుకే మెసేజింగ్ వ్యవస్థలో తిరుగులేని స్థానంలో నిలిచింది. సమాచార మార్పిడికి దీనిని మించి వేరొకటి ఊహించలేని పరిస్థితిని కల్పించింది. తన యూజర్ల నాడిని బాగా పసిగట్టగలుతుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో రోజుకో అప్ డేట్ ను తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్, ఆడియో కాల్, వీడియో కాల్, స్టేటస్ వంటి ఫీచర్లు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్టేటస్ ఫీచర్ మరింత అనువుగా వినియోగదారులకు అందించేందుకు ఐదు కొత్త అప్ డేట్లను అందించింది. అవేంటో ఓ సారి చూద్దాం..

ఇకపై వాయిస్ స్టేటస్..

వాట్సాప్ స్టేటస్ ను దాదాపు ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంటారు. దీని ద్వారా తమ ఇష్టాలు, అభిరుచులు, వ్యక్తిగత, సామాజిక విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ కింద ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక మీదట వాయిస్ మెస్సేజ్ లను సైతం స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. 30 సెకండ్ల నిడివి ఉన్న వాయిస్ సందేశాలను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. మాటలు, పాటలు, కవితలు వంటి వాటిని పెట్టుకోవచ్చు. తద్వారా సమర్థవంతంగా తమ అంతరంగాన్ని తెలియజేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీరు పెట్టిన స్టేటస్ అప్ డేట్స్ కు మీ ఫ్రెండ్స్, బంధువువులు తిరిగి ఎమోజీలతో స్పందించొచ్చు.

ప్రైవేటు ఆడియన్స్..

ఇప్పటి వరకూ మీరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన విషయాన్ని మీ కాంటాక్ట్ లిస్ట్ లోని అందరికీ కనిపిస్తుంది. కొత్త అప్ డేట్ ప్రకారం మీరు ప్రైవేటు ఆడియన్స్ ను సెట్ చేసుకోవచ్చు. అంటే మీ స్టేటస్ ను ఎవరు చూ డొచ్చు.. ఎవరు చూడకూడదు.. మీరే ఓ లిస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను వినియోగించుకునేందుకు ప్రైవసీ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టేటస్ కూ రింగ్ టోన్..

వాట్సాప్ మరో ఆసక్తికర అప్ డేట్ ను వినియోగదారులకు అందిస్తోంది. అదే స్టేటస్ ప్రొఫైల్ రింగ్స్. ఇప్పటి వరకూ ఎవరైనా స్టేటస్ పెడితే అది మనకు చూసే వరకు తెలియదు. అయితే ఇకపై మీకు నచ్చిన వ్యక్తి స్టేటస్ పెట్టగానే తెలిసేలా ఓ రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. ఈ ప్రొఫైల్ రింగ్ ఫీచర్ తో వాట్సాప్ లో మీకు ఇష్టమైన వ్యక్తి పెట్టే స్టేటస్ లు ఇక మీరు మిస్ అయ్యే చాన్స్ ఉండదు.

లింక్ ని ప్రివ్యూ చూపిస్తుంది..

ఇప్పటి వరకూ మీరు స్టేటస్ లో ఏదైనా లింక్ పెడితే అది దాని ప్రివ్యూ మనకు కనిపించదు. అయితే కొత్త అప్ డేట్ లో యూఆర్ఎల్ లింక్ స్టేటస్ లో పేస్ట్ చేయగానే దాని ప్రివ్యూ స్టేటస్ లోనే కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు బాగా ఉపకరిస్తుంది. ఆ లింక్ దేనికి సంబంధించిందో ముందే తెలిసే వీలుంటుంది. తద్వారా దానిని క్లిక్ చేయాలా వద్దా అన్నది తెలుస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!