Moto E13: రూ. 6999కే మోటరోలా కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా కూడా కొత్త ఫోన్ ను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ 13 పేరుతో కేవలం మధ్య తరగతి వినియోగదారులను దృష్టి ఉంచుకుని ఈ ఫోన్ రిలీజ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Moto E13: రూ. 6999కే మోటరోలా కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..!
Moto E13
Follow us
Srinu

|

Updated on: Feb 09, 2023 | 12:25 PM

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇదే బాటలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా కూడా కొత్త ఫోన్ ను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ 13 పేరుతో కేవలం మధ్య తరగతి వినియోగదారులను దృష్టి ఉంచుకుని ఈ ఫోన్ రిలీజ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఏ కంపెనీ ఇవ్వని ఇన్ బుల్ట్ స్టోరీజీ ఆప్షన్ మోటరోలా కంపెనీ ఇస్తుంది. 2 జీబీ+64 జీబీ వేరియంట్, 4 జీబీ+64 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. 2 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంటే, 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.7999గా ఉంది. క్లాసిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ వేరియంట్స్ లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ యాప్స్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ లో వచ్చే స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

మోటో ఈ 13 స్పెసిఫికేషన్లు ఇవే..

  • 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే
  • ఆక్టాకోర్ యూనిఎస్ఓసీ ప్రాసెసర్ 
  • 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగ్ ఆఫ్షన్
  • 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 1 టీబీ వరకూ మెమరీ విస్తరించుకునే అవకాశం
  • 10 వాట్స్ స్పీడ్ చార్జింగ్ కెపాసిటీతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 13 సపోర్టెడ్ వెర్షన్
  • ఐపీ-52 డర్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్
  • యూఎస్ బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!