AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy: గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

మామిడి పండ్లు విటమిన్‌ సికి పెట్టింది పేరు. విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరడచంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మామిడిలోని విటమిన్‌ ఏ సైతం కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది...

Pregnancy: గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Pregnant Women
Narender Vaitla
|

Updated on: May 03, 2024 | 6:22 PM

Share

ఎండకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఊరిస్తుంటాయి. కింగ్ ఆఫ్‌ ఫ్రూట్స్‌గా చెప్పుకునే మామిడి రుచి అద్భుతంగా ఉంటుంది. దీంతో ప్రతీ ఒక్కరూ మామిడిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యం పరంగా కూడా మామిడిలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఇందులోని విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే గర్భిణీలకు మామిడి మంచిది కాదని, వేడి చేస్తుందని కొందరు భావిస్తుంటారు. ఇంతకీ మామిడిని గర్భిణీలు తీసుకోవచ్చా.? తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి పండ్లు విటమిన్‌ సికి పెట్టింది పేరు. విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరడచంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మామిడిలోని విటమిన్‌ ఏ సైతం కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండ్లను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను మోతాదుకు మించి తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే కొందరిలో విరేచనాలయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇక మామిడి పండ్లను అతిగా తీసుకోవడం వల్ల గర్భిణీల్లో అధిక బరువు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే మధుమేహం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని సూచిస్తున్నారు. అప్పటికే అధిక బరువుతో ఉన్నవారు, డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..