- Telugu News Photo Gallery If you follow these tips, white clothes will always look like new, check here is details in Telugu
White Cloths Clean: ఈ టిప్స్ పాటించారంటే.. తెల్ల దుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
వైట్ డ్రెస్సులు అంటే చాలా మందికి ఇష్టం. కానీ వేసుకోవాలంటే చాలా భయ పడతారు. అందుకు కారణం వైట్ డ్రెస్సులకు ఏదైనా చిన్న మరక అంటినా అంత సులభంగా పోదు. వీటిని ఉతకడం చాలా కష్టం. అంతే కాకుండా త్వరగా మాసిపోతాయి. కానీ కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ఎన్ని సార్లు వేసుకున్నా.. కొత్త వాటిలా ఉంటాయి. తెల్ల దుస్తులను కాపాడుకోవడానికి వంట గదిలో ఉండే బేకింగ్ సోడా చక్కగా సహాయ పడుతుంది. బేకింగ్ సోడాతో వైట్ డ్రెస్సులను క్లీన్ చేస్తే..
Updated on: May 03, 2024 | 6:21 PM

వైట్ డ్రెస్సులు అంటే చాలా మందికి ఇష్టం. కానీ వేసుకోవాలంటే చాలా భయ పడతారు. అందుకు కారణం వైట్ డ్రెస్సులకు ఏదైనా చిన్న మరక అంటినా అంత సులభంగా పోదు. వీటిని ఉతకడం చాలా కష్టం. అంతే కాకుండా త్వరగా మాసిపోతాయి. కానీ కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ఎన్ని సార్లు వేసుకున్నా.. కొత్త వాటిలా ఉంటాయి.

తెల్ల దుస్తులను కాపాడుకోవడానికి వంట గదిలో ఉండే బేకింగ్ సోడా చక్కగా సహాయ పడుతుంది. బేకింగ్ సోడాతో వైట్ డ్రెస్సులను క్లీన్ చేస్తే.. తెల్లగా ఉంటాయి. బేకింగ్ సోడాతో ఇంట్లో ఎన్నో వస్తువులను శుభ్ర పరచుకోవచ్చు.

బేకింగ్ సోడాతో బట్టలు ఉతకడం వల్ల దుర్వాసన కూడా మాయమైపోతుంది. ఇది నీటి పీహెచ్ స్థాయిని నియంత్రించడానికి చక్కగా సహాయ పడుతుంది. దుస్తుల్లో ఉండే మురికిని పోగొట్టి తెల్లవాటిలా ఉంచుతుంది.

బేకింగ్ సోడాతో పాటు బ్లీచింగ్ కూడా కలిపి ఉపయోగించడం వల్ల బట్టలు తెల్లగా ఉంటాయి. బేకింగ్ సోడా అయినా, బ్లీచింగ్ అయినా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే దుస్తులు త్వరగా చీలిపోతాయి.

బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలంటే.. చేతితో ఉతికేటప్పుడు సర్ఫ్‌తో పాటు ఒక స్పూన్ బేకింగ్ సోడాను కూడా కలపండి. వాషింగ్ మిషీన్‌లో ఉతుకుతున్నట్లయితే.. ఓ అరకప్పు బేకింగ్ సోడాను నీటితో కలిపి వేసేయండి.




