AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Camphor: గాయాలు, కీళ్ల నొప్పులను తగ్గించే కర్పూరం.. ఇంకా ఎన్నో లాభాలు..

ప్రతీ ఒక్కరి ఇంట్లో కర్పూరం ఉంటుంది. కర్పూరాన్ని ఎక్కువగా పూజలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో కర్పూరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి. తినే కర్పూరం, పూజలో వాడే కర్పూరం, పచ్చ కర్పూరం. ఇలా వీటితో వివిధ సమస్యలను తగ్గించుకోవచ్చు. పూజలో వాడే కర్పూరాన్ని తినకూడదు. తినే కర్పూరాన్ని..

Camphor: గాయాలు, కీళ్ల నొప్పులను తగ్గించే కర్పూరం.. ఇంకా ఎన్నో లాభాలు..
స్వచ్ఛమైన కర్పూరం త్వరగా కరగదు. కాలిపోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు వెలిగించిన కర్పూరం త్వరగా కాలిపోయి కరిగిపోతే, దానిని నకిలీ కర్పూరంగా అర్థం చేసుకోవచ్చు.
Chinni Enni
|

Updated on: Sep 14, 2024 | 1:39 PM

Share

ప్రతీ ఒక్కరి ఇంట్లో కర్పూరం ఉంటుంది. కర్పూరాన్ని ఎక్కువగా పూజలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో కర్పూరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి. తినే కర్పూరం, పూజలో వాడే కర్పూరం, పచ్చ కర్పూరం. ఇలా వీటితో వివిధ సమస్యలను తగ్గించుకోవచ్చు. పూజలో వాడే కర్పూరాన్ని తినకూడదు. తినే కర్పూరాన్ని పూజలో ఉపయోగించ కూడదు. కర్పూరంతో జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, గాయాలను కూడా తగ్గించుకోవచ్చు. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో పచ్చ కర్పూరం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గాయాలు తగ్గుతాయి:

పచ్చ కర్పూరాన్ని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గాయం తగిలిన చోట కర్పూరం పొడిని అప్లై చేయడం వల్ల త్వరగా నొప్పి ుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇలా రెండు, మూడు రోజులు రాస్తే.. గాయం త్వరగా మానుతుంది. పచ్చ కర్పూరాన్ని పొడి చేసి నీటిలో లేదా నూనెలో వేసి పేస్టులా చేసి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గాయం, నొప్పి త్వరగా తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు మాయం:

పచ్చ కర్పూరంతో కీళ్ల నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. నొప్పులు వస్తున్న చోట రాసుకుంటే.. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది. కర్పూరం పొడిని నీటిలో కలిపి పేస్టులా చేసి.. కీళ్ల నొప్పులు వస్తున్న చోట ప్రతి రోజూ రాస్తూ ఉండాలి. ఇలా కొద్ది రోజులకు నొప్పులు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

దురద, చుండ్రు:

కర్పూరంతో దురద, చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. దురద పోవాలంటే కొబ్బరి నూనెలో కర్పూరం వేసి దురద ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మర్దనా చేయండి. తలపై కూడా ఇలాగే చేయాలి. ఇలా చేస్తే దురద, చుండ్రు తగ్గుతాయి.

నిద్ర సమస్యలకు:

నిద్ర సమస్యలతో బాధ పడేవారు కూడా కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. రాత్రిపూట మీకు నిద్ర సరిగా పట్టక బాధ పడుతూ ఉంటే.. కర్పూరం హెల్ప్ చేస్తుంది. మీరు నిద్రించే దిండుపై కొన్ని చుక్కల కర్పూరం నూనె చల్లాలి. ఆ వాసనకు మనసు రిలాక్స్ అయి నిద్ర హాయిగా పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?