Heel Pain: ఇలా చేశారంటే మడమల నొప్పి మాయం అవుతుంది..
ప్రస్తుత కాలంలో లేని సమస్య అంటూ ఏదీ ఉండటం లేదు. ఎక్కువగా నిలబడి పని చేసే వారికి, ఎక్కువ సేపు నిలబడటం వల్ల లేదా ఎక్కువగా నడిచేవారిలో కూడా ఎక్కువగా మడమ నొప్పి సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఉదయం లేచిన తర్వాత నడవటం కూడా కష్టంగా మారుతుంది. రాత్రిళ్లు కూడా ఎక్కువగా మడమ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సేపు నడవలేరు. ఈ మడమ నొప్పి..

ప్రస్తుత కాలంలో లేని సమస్య అంటూ ఏదీ ఉండటం లేదు. ఎక్కువగా నిలబడి పని చేసే వారికి, ఎక్కువ సేపు నిలబడటం వల్ల లేదా ఎక్కువగా నడిచేవారిలో కూడా ఎక్కువగా మడమ నొప్పి సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఉదయం లేచిన తర్వాత నడవటం కూడా కష్టంగా మారుతుంది. రాత్రిళ్లు కూడా ఎక్కువగా మడమ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సేపు నడవలేరు. ఈ మడమ నొప్పి.. ప్లాంటర్ ఫాసిటిస్ వల్ల వస్తుందని నిపుణులు అంటున్నారు. మడమ కింద ఉండే కణజాలం గట్టిపడి స్ట్రిప్ ఉబ్బినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
సరైన చెప్పులను ఎందుచుకోండి:
మడమ నొప్పి సమస్యలతో బాధ పడేవారు ముందుగా సరైన చొప్పులను ఎంచుకోవాలి. మెత్తగా, కుషన్‌లా ఉండే చొప్పులు వేసుకోవడం వల్ల ఈ నొప్పులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. మడమ నొప్పులతో బాధ పడేవారు నేలపై నేరుగా నడవక పోవడం మంచిది.
ఐస్‌తో కాపడం పెట్టండి:
మడమ నొప్పి నుంచి ఉపశమనం కల్పించడంలో ఐస్ కూడా చక్కగా సహాయ పడుతుంది. ఐస్ క్యూబ్స్‌ని క్లాత్‌లో చుట్టి మడమలు, పాదాలపై పెట్టడం వల్ల నొప్పిని తగ్గించుకోవచ్చు.
అలోవెరా జెల్:
మడమ నొప్పిని తగ్గించడంలో అలోవెరా జెల్ చక్కగా సహాయ పడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొద్దిగా కలబందను తీసుకుని ప్రతి రోజూ మడమలపై పెట్టండి. ఈ రెమిడీ తక్కువ సమయంలోనే ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.
కలబంద – పసుపు:
కలబంద, పసుపుతో కూడా మడమల నొప్పిని తగ్గించుకోవచ్చు. ముందుగా అలోవెరాను తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇందులో పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్లీ వేడి చేసి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు మడమలపై పెట్టాలి. ఆ తర్వాత గుడ్డతో కట్టి మడమలను కప్పండి. ఇలా రాత్రంతా ఉంచండి. ఇలా కొద్ది రోజులు చేయగానే నొప్పులు తగ్గుతాయి.
పాలు – పసుపు:
మడమల నొప్పులతో బాధ పడేవారు ప్రతి రోజూ గోరువెచ్చటి పాలలో పసుపు, తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు, మడమల నొప్పులు తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








