Breastfeeding Week 2021 : తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి మహిళ తెలుసుకోవాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
Breastfeeding Week 2021 : నవజాత శిశువుకు తల్లిపాలు ఒక వరంగా భావిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి చెబుతున్నారు. అయినా కొంతమంది మహిళలు పట్టించుకోవడం
Breastfeeding Week 2021 : నవజాత శిశువుకు తల్లిపాలు ఒక వరంగా భావిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి చెబుతున్నారు. అయినా కొంతమంది మహిళలు పట్టించుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా తల్లిపాలను సిఫార్సు చేస్తుంది. అయితే గణాంకాల ప్రకారం చూస్తే ఐదుగురిలో ఇద్దరు మహిళలు మాత్రమే ప్రసవించిన మొదటి గంటలో పిల్లలకు పాలు పడుతున్నారు. గ్లోబల్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2021 లో కొత్త తల్లులు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..
1. శిశువుకు పోషకాహారంలో తల్లి పాలు ఉత్తమమైనవి. సులభంగా జీర్ణమవుతాయి.
2. ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ ఉండటం వల్ల తల్లి పాలు శిశువులను జలుబు, ఫ్లూ, న్యుమోనియా, ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి.
3. తల్లిపాలు పిల్లలను టైప్ 2 డయాబెటిస్ నుంచి రక్షిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. తల్లి పాలలో విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పిల్లలకు సులభంగా జీర్ణమయ్యే రూపంలో అందుతాయి.
5. తల్లి పాలలో ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి మీ బిడ్డకు వైరస్, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
6. మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే శిశువులకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు విరేచనాల లక్షణాలు తక్కువగా ఉంటాయి.
బిడ్డకు ఎందుకు తల్లిపాలు ఇవ్వాలి?
రొమ్ము పాలు త్వరగా జీర్ణమవుతాయి ప్రతి రెండు గంటలకు బిడ్డకు పాలు ఇవ్వడం మంచిది. మీ బిడ్డకు ఆహారం ఇవ్వడానికి పాలు ఉత్తమ మార్గమని గుర్తించండి. నవజాత తల్లులు ప్రసవ వేదన నుంచి కోలుకోవడానికి, శిశువుతో బంధం ఏర్పడటానికి తల్లిపాలు ఒక వరంలాంటివి. భారతదేశంలో పబ్లిక్ ఫీడింగ్ సాధారణం కానందున చాలా మంది తల్లులు బహిరంగంగా తల్లిపాలు ఇవ్వడం కష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రయాణం చేస్తున్నప్పుడు టాయిలెట్ వంటి అపరిశుభ్ర వాతావరణంలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా చూసుకోండి. ఇది మిమ్మల్ని మీ బిడ్డని ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తుంది. అనేక అధ్యయనాల ఆధారంగా ఈ విషయాలను తెలియజేస్తున్నామని గుర్తించండి.