Snake Hulchul: సయ్యాట ఆడుతున్న పాములను విడదీశారు.. ఆ తర్వాత అసలు సీన్ స్టార్టయ్యింటి

ఓ ఇద్దరి యువకుల అతి ఉత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. పాముతో ఆడిన ఆట కాస్త ఆస్పత్రి పాలు చేసింది‌. విష సర్పం అని తెలిసినా...

Snake Hulchul: సయ్యాట ఆడుతున్న పాములను విడదీశారు.. ఆ తర్వాత అసలు సీన్ స్టార్టయ్యింటి
Snake Bite
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2021 | 7:14 PM

ఓ ఇద్దరి యువకుల అతి ఉత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. పాముతో ఆడిన ఆట కాస్త ఆస్పత్రి పాలు చేసింది‌. విష సర్పం అని తెలిసినా కాటేస్తే కాటికి పోవడం ఖాయమని అవగాహన ఉన్నా..  మాకేం కాదులే అన్న మొండి ధైర్యం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.. మరో యువకుడు బ్రతుకు జీవుడా అంటూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  కొమురంభీం జిల్లా జైనూరు కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్దకు ఓ రెండు పాములు సయ్యాడుతూ వచ్చాయి. అంతే అక్కడే పక్కన ఉన్న ఓ ఇద్దరి యువకులు.. ఆ పాములను వేరు చేసే సాహసం చేశారు. ఓ పామును పట్టుకుని దానిని‌ ఊరంతా బైక్ మీద తిప్పారు. అయితే అసలు ప్రమాదం ఇక్కడే చోటు చేసుకుంది. పాము ప్రాణాలతో ఉండటం అప్పటికే గాయాలు కావడంతో తనను పట్టుకున్న యువకుడి ఎడమ చేతిపై కాటేసింది. అంతే ఒక్క ఉదుటన ఆ పామును వదిలేసి అదే బైక్ పై ఆస్పత్రికి పరుగులు తీసాడు‌. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమురంభీం జిల్లా జైనూర్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయం పక్కన రెండు పాములు సయ్యాటలాడుతు కనిపించాయి. ఈ క్రమంలో వాటిని పట్టుకునేందుకు స్థానికులు, సోనుపటేల్‌ గూడకు చెందిన కనక రాంజీ, కనక రాందాస్‌లకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న అన్నదమ్ములిద్దరు.. హనుమాన్ ఆలయం వద్ద సయ్యాటలడుతున్న జంట పాములను చేతితో ఓడిసి పట్టుకుని అడవిలో వదిలేసేందుకు బయలుదేరారు. అయితే.. అక్కడితో ఆగితే ఏం మజా అనుకున్నారో ఏమో కానీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములు పట్టుకున్న పాములను ఊరంతా చూపుతూ బైక్ పై చక్కర్లు కొట్టారు. అందులో ఓ పాము తీవ్రగాయాలు కావడంతో బుసలు కొడుతూ.. తీవ్రమైన కోపంతో కనక రాంజీ అనే యువకుడి ఎడమ చేయి బోటన వేలుపై కాటు వేసింది. ఇక ఆ తరువాత జరిగిన విషయం తెలిసిందే. రాంజీని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అతి ఎప్పటికైనా కీడే అన్నది ఈ పాము కాటుతో మరోసారి నిర్దారణ అయ్యింది.

( నరేష్, టీవీ9 తెలుగు, ఆదిలాబాద్ )

Also Read: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!