Cyberabad Police: ఈ సరదా చాలా ప్రమాదకరం.. దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై అర్థరాత్రి యువకుడి చిందులు. వైరల్ వీడియో.

Cyberabad Traffic Police: ఒక చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే కొందరు మాత్రం వాటిని పెడ చెవిన పెడుతూ ఉంటారు. ముఖ్యంగా..

Cyberabad Police: ఈ సరదా చాలా ప్రమాదకరం.. దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై అర్థరాత్రి యువకుడి చిందులు. వైరల్ వీడియో.
Durgam Cheruvu Flyover
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 05, 2021 | 7:07 PM

Cyberabad Traffic Police: ఒక చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే కొందరు మాత్రం వాటిని పెడ చెవిన పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటించి క్షేమంగా ఉండండి అంటూ ఓవైపు పోలీసులు చెబుతున్నా వినకుండా అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. సరదాగా చేస్తోన్న పనులు ప్రాణాలను తీస్తోన్న సంఘటనలు మనకు నిత్యం వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయినా మారడం లేదు. తాజాగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇలాంటి ఓ వీడియోనే పోస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. అది హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌, సమయం అర్థరాత్రి 01:20 గంటలు. ఆ సమయంలో కొందరు యువకులు ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్నారు. వారిలో ఓ వ్యక్తి యువకుడు ప్రమాదకంగా రోడ్డు దాటుతూ, డ్యాన్స్‌లు చేశాడు. అర్థరాత్రి పూట ఫ్లై ఓవర్‌పై వచ్చిన కార్లకు ఇబ్బంది కలిగించాడు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు.. ‘పాదచారులు ఫ్లై ఓవర్‌పైకి రావడం ప్రమాదకరం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెట్టిన ఆ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ మరింత ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. చివరిగా పోలీసులు వస్తున్నారనుకున్నాడేమో ఫుట్‌పాత్‌ పైకి వెళ్లిపోయాడు. ‘సరదా కోసం ప్రాణాలు తెగ్గించి రోడ్లపై విన్యాసాలు, డ్యాన్స్‌లు చేయకండి’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: AP SSC Results: రేపే టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

Suriya’s ‘Jai Bhim’: మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిన సూర్య.. త్వరలోనే స్ట్రీమింగ్

Viral Video : మొసలితో సెల్ఫీ దిగితే ఆ కిక్కే వేరప్ప..! సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?