Viral Video : మొసలితో సెల్ఫీ దిగితే ఆ కిక్కే వేరప్ప..! సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..

Viral Video : మధ్యప్రదేశ్‌లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. శివపురి జిల్లాలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలో చూసినా నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

Viral Video : మొసలితో సెల్ఫీ దిగితే ఆ కిక్కే వేరప్ప..! సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
Selfie With Crocodile
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 6:39 PM

Viral Video : మధ్యప్రదేశ్‌లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. శివపురి జిల్లాలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలో చూసినా నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అయితే శివపురి జిల్లాలోని ఓ మార్కెట్‌లో వరదనీటిలో ఓ మొసలి కొట్టుకొచ్చింది. గమనించిన స్థానిక ప్రజలు దానిని పట్టుకొని తాళ్లతో బంధించారు. అంతేకాకుండా మొసలిని ఎత్తుకొని సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అయితే ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

శివపురి నగరానికి సమీపంలో ఒక జాతీయ ఉద్యానవనం ఉంది. ఈ జాతీయ ఉద్యానవనంలో అనేక మొసళ్ళు ఉన్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జాతీయ ఉద్యానవనం పక్కనే ఉన్న కాలువల నుంచి మొసళ్ళు పట్టణ ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం శివపురి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో మొసళ్లు నీటితో తడిసిన రోడ్లపై ఈత కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రజలు మొసలిని తాడులతో కట్టి, వారి భుజాలపై ఎత్తుకొని ఫోటోలు దిగుతుండటం మనం వీడియోలో చూడవచ్చు.

శివపురి జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలువల ద్వారా మొసలి నగరంలోని మాంసం మార్కెట్లోకి వచ్చింది. మొదటగా వర్షంలో తడిసిన యువత ఈ మొసలిని పట్టుకున్నారు. అయితే తాళ్లతో బంధించిన మొసలి విడిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది భుజాల పై నుంచి కిందపడుతుంది. ఈ సమయంలో యువత నవ్వుతూ కనిపించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. సాధారణంగా మొసలిని చూస్తే చాలామంది భయంతో దూరంగా ఉంటారు కానీ ఇక్కడి ప్రజలు దానిని పట్టుకొని ఆటలు ఆడటం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని తీసుకెళ్లి చంద్‌పథ సరస్సులో వదిలిపెట్టారు.

Viral Video : పాముకి ఎలుకను తినిపిస్తున్న వ్యక్తి ..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?

Minister Harish Rao: హుజూరాబాద్‌లో బిజేపీ,కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందం.. దళితుల ఓట్లను చీల్చేందుకు కుమ్మక్కు..ఈటలపై మంత్రి హరీశ్‌ రావు

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?