Lips Care: పెదాలు నల్లగా మారి పగిలిపోయాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

అందంగా కనిపించాలంటే కేవలం ముఖమే కాదు పెదాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. అందాన్ని ఆకర్షించే గుణం పెదాలకు ఉంది. కేవలం ముఖంపై మాత్రమే కాకుండా పెదాలపై కూడా శ్రద్ధ పెట్టండి. చలి కాలంలో మీ పెదాలు నల్లగా మారి పగిలిపోతే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

Lips Care: పెదాలు నల్లగా మారి పగిలిపోయాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
Lip Care
Follow us
Chinni Enni

|

Updated on: Dec 18, 2024 | 12:39 PM

ముఖం, జుట్టుపై పెట్టే శ్రద్ధ చాలా మంది లిప్స్‌పై పెట్టరు. అందంగా కనిపించాలంటే లిప్స్ కూడా ముఖ్యమే. అందులోనూ చలి కాలంలో పెదాలు పగిలిపోతూ ఉంటాయి. మరికొందరికి నల్లగా మారతాయి. పెదాలు పగలడం వల్ల చిరాకుగా కనిపిస్తాయి. ఈ సమస్యలను చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇందు కోసం డబ్బు ఖర్చు చేసి మరీ కాస్ట్‌లీ లిప్ కేర్ ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వలన క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ధూమ పానం, మధ్య పానం, వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా పెదాలు అనేవి నల్లగా మారుతూ ఉంటాయి. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నా కూడా పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. చాలా మంది ఈ సమస్యలో ఇబ్బంది పడే ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఇంటి వద్దనే ఈజీ చిట్కాలతో పెదాలను ఎర్రగా, అందంగా మార్చుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

కొబ్బరి నూనె:

చాలా మంది మనకు ఈజీగా లభించే వస్తువులను పక్కకు పెట్టి ఖర్చు పెట్టి మరీ కాస్ట్‌లీ ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తారు. మనకు ఈజీగా లభించే వాటిల్లో కొబ్బరి నూనె ఒకటి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసి పడుకోండి. కొబ్బరి నూనెలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి పెదాలను మృదువుగా, కోమలంగా మార్చుతాయి.

పంచదార – నెయ్యి:

నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా అనేక పోషకాలు ఉంటాయి. మీ పెదాలు నల్లగా మారి, పగిలిపోతే నెయ్యిలో కొద్దిగా పంచదార కలిపి పెదాలపై రబ్ చేయండి. ఇలా ఓరెండు నిమిషాలు చేసిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడగండి. ఆ తర్వాత కొబ్బరినూనె లేదా వాజెలీన్ లేదా లిప్ బామ్ రాసినా చాలు.

ఇవి కూడా చదవండి

హోమ్ మేడ్ సీరమ్:

పెదాలను అందంగా మార్చడంలో ఇంటి వద్దనే సీరమ్ కూడా తయారు చేసుకోవచ్చు. బయట కొనే వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వలన అనేక వ్యాధులు రావచ్చు. పెదాలను ఎర్రగా, మృదువుగా అందంగా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ముందుగా ఓ బౌల్‌లోకి కొద్దిగా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ట్రైచేయండి. ఇందులో నిమ్మరసం నాలుగు చుక్కలు, ఆఫ్ స్పూన్ గ్లిజరిన్, కలబంద గుజ్జు వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ సీరమ్‌ని కనీసం రోజుకు రెండు సార్లు పెదాలపై రాస్తూ ఉండండి. కొద్ది రోజులకే పెదాలు మృదువుగా, గులాబీ రంగులోకి మారతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.