AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: వేసవిలో ఈ టోనర్ వాడి చూడండి.. ముఖం మెరిసిపోతుంది..!

వేసవి కాలంలో చర్మం ఎండ వలన బాగా పొడిబారిపోతుంది. దీని వల్ల మంట, మచ్చలు, మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా సహజ పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసే చల్లదనాన్ని కలిగించే టోనర్ వాడితే చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా ఉంటుంది.

Beauty Tips: వేసవిలో ఈ టోనర్ వాడి చూడండి.. ముఖం మెరిసిపోతుంది..!
Beauty Tips
Prashanthi V
|

Updated on: Apr 09, 2025 | 8:50 PM

Share

వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మన చర్మం సహజంగా పొడిబారిపోతుంది, బూడిదగా మారుతుంది. బయట తిరిగిన తరువాత చెమట, దుమ్ము ధూళి వల్ల చర్మం ముడతలు పడే అవకాశమూ ఉంది. అందుకే వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచడం, చల్లదనాన్ని కలిగించడం చాలా అవసరం.

మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రాడక్ట్స్‌ ఉపయోగించే బదులు మన ఇంట్లోనే సహజంగా తయారయ్యే చర్మ సంరక్షణ టోనర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ టోనర్ తయారీకి కావలసినవి చాలా తక్కువ పైగా అందుబాటులో ఉండేవే. ముఖ్యంగా కీరదోసకాయ ప్రధాన పదార్థం. ఇది చర్మానికి తేలికపాటి చల్లదనం కలిగించి, మృదుత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం కీరదోసకాయ టోనర్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కీరదోసకాయతో చర్మాన్ని చల్లగా ఉంచే సహజ టోనర్ తయారీ ప్రక్రియ చాలా సులభం. మొదట కీరదోసకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి కొద్దిగా తాగునీరు కలిపి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడపోత సహాయంతో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ కీరదోసకాయ రసంలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలపాలి.

అదేవిధంగా ఒక స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి బాగా కలిపాలి. చర్మానికి మరింత మంచి ప్రభావం కోసం కొద్దిగా నిమ్మరసం కూడా జోడించవచ్చు. ఇది చర్మానికి సహజమైన తేజాన్ని ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఇలా ఉంచితే ఈ సహజ టోనర్ కొన్ని రోజుల పాటు నిల్వ ఉండి చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

ప్రతి రోజూ ఈ టోనర్‌ను ఉదయం లేచి ముఖం కడుక్కున్న తర్వాత, రాత్రి నిద్రకు ముందు స్ప్రే చేయాలి. ఎండలో తిరిగొచ్చిన తర్వాత ముఖంపై స్ప్రే చేస్తే చర్మానికి చల్లదనం లభిస్తుంది. చర్మం రిఫ్రెష్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. టోనర్‌ను ముఖం మాత్రమే కాకుండా మెడ భాగానికి కూడా అప్లై చేయొచ్చు.

ఈ టోనర్ వాడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? కీరదోసకాయలో ఉండే సహజ చల్లదనం వేసవిలో చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. అలోవెరా జెల్ చర్మానికి తేమను అందించి దాని మృదుత్వాన్ని పెంచుతుంది. రోజ్ వాటర్ చర్మానికి మంచి వాసనను అందించడంతో పాటు, కళ్ల చుట్టూ ఉండే నలుపు దారలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మొటిమలు, చర్మంపై కనిపించే చిన్న వాపులు తగ్గించడంలో కూడా ఈ టోనర్ ఎంతో సహాయపడుతుంది.

ఈ వేసవిలో చర్మం మెరిసిపోవాలని అనుకుంటే సహజ పదార్థాలతో చేసిన ఈ టోనర్‌ను ఉపయోగించండి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడమే కాకుండా ఖర్చు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హార్మ్ చేసే కెమికల్స్ మినహా పూర్తి సహజమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజు రెండుసార్లు క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మీ చర్మం తళతళలాడుతుంది. ఈ టోనర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఒక చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.