Ragi Roti: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. రాగి రొట్టెలు తినాల్సిందే!

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు ట్రై చేస్తున్నారు. హెల్దీ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రెలు వంటి మిల్లెట్స్‌తో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య పరంగా అనేక లాభాలు ఉన్నాయి. చిరు ధాన్యాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగుల్లో మన శరీరానికి అవసరమైన..

Ragi Roti: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. రాగి రొట్టెలు తినాల్సిందే!
Ragi Roti Benefits
Follow us
Chinni Enni

|

Updated on: May 13, 2024 | 1:53 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు ట్రై చేస్తున్నారు. హెల్దీ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రెలు వంటి మిల్లెట్స్‌తో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య పరంగా అనేక లాభాలు ఉన్నాయి. చిరు ధాన్యాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగుల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. రాగులతో కూడా అనేక రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాల హెల్దీ వంటకాలు మనం తెలుసుకున్నాం. రాగులతో చాలా మంది రొట్టెలు కూడా తయారు చేసుకుని తింటారు. గోధుమ పిండితో తయారు చేసే రొట్టెల కంటే… రాగి రొట్టెలు హెల్త్ కి మరింత మంచిది. రాగి రొట్టలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్ అవుతారు:

రాగి రొట్టెలను తరచూ తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వీటిల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రాగి రొట్టెలు తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ విధంగా బరువు అనేది కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వీటిని తినడం వల్ల ఇతర పోషకాలు కూడా అందుతాయి.

ఎముకలు – దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి:

రాగుల్లో ఎక్కువగా క్యాల్షియం లభిస్తుంది. కాబట్టి రాగి రొట్టెలు తింటే ఎముకలు, దంతాలు బలంగా, దృఢంగా ఉంటాయి. రాగి రోటీలను క్రమం తప్పకుండా తింటే.. ఎముకలకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ కంట్రోల్:

రాగుల్లో పాలీఫెనాల్స్, కరగని ఫైబర్, డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

జీర్ణ క్రియ పదిలం:

రాగుల రొట్టెలు తినడం వల్ల జీర్ణక్రియ చక్కగా పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు