AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs: గుడ్లు తింటే మొటిమలు వస్తాయా.? ఇలాంటి అపోహల్లో నిజమెంతా.?

కోడి గుడ్డు కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తీసుకునే ఆహారంలో ఒకటి. వారంలో ఒక్కసారైనా నాన్‌ వెజ్‌ తినని వారు కూడా కోడి గుడ్లను డైట్‌లో భాగం చేసుకుంటారు. సండే లేదా మండే ప్రతీ రోజూ గుడ్డు అనే నినాదంతో గుడ్డు ప్రాముఖ్యత గురించి వివరిస్తుంటారు. గుడ్డులో ఉండే పోషకాలు అలాంటివి మరి. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ ఒక గుడ్డును తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు...

Eggs: గుడ్లు తింటే మొటిమలు వస్తాయా.? ఇలాంటి అపోహల్లో నిజమెంతా.?
Myths About Eggs
Narender Vaitla
|

Updated on: May 13, 2024 | 2:45 PM

Share

కోడి గుడ్డు కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తీసుకునే ఆహారంలో ఒకటి. వారంలో ఒక్కసారైనా నాన్‌ వెజ్‌ తినని వారు కూడా కోడి గుడ్లను డైట్‌లో భాగం చేసుకుంటారు. సండే లేదా మండే ప్రతీ రోజూ గుడ్డు అనే నినాదంతో గుడ్డు ప్రాముఖ్యత గురించి వివరిస్తుంటారు. గుడ్డులో ఉండే పోషకాలు అలాంటివి మరి. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ ఒక గుడ్డును తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే గుడ్డుతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసినా.. కొన్ని అపోహలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటిలో ఉన్న నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

* కోడి గుడ్డు తింటే మొటిమలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్లు తీసుకోవడం వల్ల మృదువైన చర్మానికి కావాల్సిన పౌష్టిక ఆహారం లభిస్తుంది తప్ప మొటిమలు అవుతాయి అనడంలో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు.

* ఇక బ్రౌన్‌ కలర్‌లో ఉన్న గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయనే భావనలో ఉంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు అంటున్నారు. గుడ్డు ఏ రంగులో ఉన్నా అందులో ఉండే పోషకాలు మాత్రం ఒకేలా ఉంటాయని చెబుతున్నారు.

* ఇక గుడ్డు సొన తినడం వల్ల బరువు పెరుగుతారని నమ్మేవారు కూడా మనలో చాలా మందే ఉంటారు. అయితే ఇది కూడా ఒక అపోహ మాత్రమే. కోడి గుడ్డు సొనలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్‌ ఉంటాయి. దీనిని తినటానికి బరువు పెరగటానికి ఎటువంటి సంబంధం లేదు.

* మనలో చాలా మంది గుడ్డును కడగడం మంచిదనే భావనలో ఉంటారు. అయితే గుడ్లపై సాల్మోనిలా అనే బ్యాక్టీరియా కొన్ని రకాల జబ్బులను కలగజేస్తుంది. గుడ్డును కడిగినప్పుడు ఈ బ్యాక్టీరియా లోపలికి చేరే అవకాశముంటుంది. కాబట్టి కోడి గుడ్డును కడగకూడదు.

* కోడి గుడ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే ఇందులో కూడా నిజం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం మోతాదుకు మించి తీసుకుంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..