Child Pose Benefits: బాలాసనంతో బోలెడన్ని ప్రయోజనాలు.. అస్సలు మిస్ చేయకండి!
యోగాతో ఎన్నో ఆగోత్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలుసు. తమ అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడానికి కొంత మంది యోగానే ఎంచుకుంటారు. ఇలా ఒక్కో ఆసనంతో కొన్ని రకాల ప్రయోజనాలతో పాటు.. వ్యాధులు, రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చు. యోగాతో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా రెట్టింపు అవుతుంది. అందాన్ని పెంచే యోగాసనాలు కూడా ఉన్నాయి. ఒక వేళ మీకు యోగా అనేది అలవాటు లేకపోయినా సరే..

యోగాతో ఎన్నో ఆగోత్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలుసు. తమ అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడానికి కొంత మంది యోగానే ఎంచుకుంటారు. ఇలా ఒక్కో ఆసనంతో కొన్ని రకాల ప్రయోజనాలతో పాటు.. వ్యాధులు, రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చు. యోగాతో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా రెట్టింపు అవుతుంది. అందాన్ని పెంచే యోగాసనాలు కూడా ఉన్నాయి. ఒక వేళ మీకు యోగా అనేది అలవాటు లేకపోయినా సరే.. ఇప్పుడు చెప్పే ఆసనాన్ని ట్రై చేయండి. ఇది చేసేందుకు సింపుల్ ఆసనమే అయినా.. శరీరానికి, ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
అదే బాలాసనం. దీన్ని ఇంగ్లీషులో చైల్డ్ పోజ్ అని అంటారు. అంటే చిన్న పిల్లలు ఏ విధంగా బోర్లా పడుకుంటారో.. దాన్నే బాలాసనం అని అంటారు. ఇది చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండోయ్. ఇది వేయడం వల్ల కండరాలను బలోపేతం చేయడమే కాకుండా.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వెన్నుముక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఆసనం వేయండి. బాలాసనంతో ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గిస్తుంది:
చాలా మంది ఈ రోజుల్లో పని వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆందోళన, భయం ఇవి కాస్తా.. మనిషిని ఒక్కోసారి డిప్రెషన్‌లోకి నెడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది:
బాలాసనం వేయడం వల్ల శరీరంలో, మెదడులో రక్త ప్రసరణ అనేది చురుగ్గా జరుగుతుంది. మెదడు పని తీరును కూడా మెరుగు పరుస్తుంది. తలనొప్పి తగ్గడమే కాకుండా.. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు మైగ్రేన్‌తో సతమతమవుతున్నారు. అలాంటి వాళ్లు ఈ ఆసనం వేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.
ఊపిరితిత్తులకు మంచిది:
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు కూడా ఈ ఆసనం వేస్తే మెరుగైన రిజల్ట్స్ ఉంటాయి. ఊపిరి కూడా ఫ్రీగా తీసుకోగలరు. అదే విధంగా ఛాతీ నొప్పి నివారణ కోసం కూడా ఈ ఆసనం వేయవచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రక్త పోటును కూడా తగ్గిస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు కంట్రోల్ అవుతాయి. మధుమేహ రోగులకు కూడా బెస్ట్ ఆసనంగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం.. కేవలం అవగాహన కోసం మాత్రమే. వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. సలహాలు, సూచనలు కావాలన్నా వైద్య నిపుణులను కలవడం మంచిది.








