ఆహారంతో డయాబెటిస్ నిజంగానే అదుపులో ఉంటుందా.? వైద్యులు ఏం చెబున్నారంటే..
ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా డయాబెటిస్ సమస్య ఎక్కువగా కనిపించేది. అయితే ప్రస్తుతం ముప్పై వాళ్ల వారు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధికి చెక్ పెట్టడానికి జీవనశైలిలో మార్పు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు...

మానవాళిని భయపెడుతోన్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రధానమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా డయాబెటిస్ సమస్య ఎక్కువగా కనిపించేది. అయితే ప్రస్తుతం ముప్పై వాళ్ల వారు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధికి చెక్ పెట్టడానికి జీవనశైలిలో మార్పు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, జీవనశైలిని మార్పు చేసుకోవడం వల్ల నిజంగానే డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టొచ్చా.? అసలు దీని గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంకీ టైప్ 2 డయాబెటిస్ ఎందుకు వస్తుంది.?
అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా టైప్-2 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది లేదా ఆగిపోతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీరంలో కొన్ని అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఇదే విషయమై.. ఢిల్లీలోని సఫ్గర్‌జంగ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ సుమన్ మాట్లాడుతూ.. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. వైద్యుల సలహా మేరకు మంచి ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
టైప్-2 మధుమేహాన్ని ఆరోగ్యకరమైన జీవనవిధానం, మంచి ఆహారంతో అదుపులో ఉంచుకోవచ్చు. అయితే మధుమేహ వ్యాధిని పూర్తిగా తొలగించలేము. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారంతో పాటు వ్యాయామం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతీ రోజూ అరగంట పాటు నడవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి వంటి మధుమేహం వల్ల కలిగే హానిని కూడా నివారించవచ్చు.
ఇదిలా ఉంటే.. ఆరోగ్యకరమైన ఆహారం మధుమేహాన్ని నియంత్రించగలదని వైద్యులు చెబుతున్నప్పటికీ.. టైప్-1 విషయంలో పూర్తిగా నియంత్రించడం కష్టమని చెబుతున్నారు. టైప్-1లో, శరీరం తనంతట తానుగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసుకోదు కాబట్టి, ఇంజెక్షన్లు, మందుల ద్వారా శరీరానికి ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. కాబట్టి, టైప్-2 బాధితులు.. తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారంలో.. పచ్చికూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, పాలు, పెరుగును భాగం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజూ అరగంటైనా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




