Beauty tips : ఆవిరిని తీసుకునేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో తెలుసుకోండి..!
Beauty tips : మానవ శరీరంలో చర్మం చాలా సున్నితమైనది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యం. అలాగే..
Beauty tips : మానవ శరీరంలో చర్మం చాలా సున్నితమైనది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యం. అలాగే.. తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం ప్రజలు అనేక రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, అతిగా రసాయనాలను వాడటం వల్ల కూడా చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. అదే సమయంలో చాలా మంది హోమ్ రెమెడీస్ పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకుంటారు. అయితే, ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్ల కారణంగా.. ముఖ చర్మం కాంతి హీనంగా, తేజస్సు కోల్పోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా.. చాలా మంది ముఖానికి ఆవిరి పడుతుంటారు. ఎందుకంటే చర్మ సంరక్షణలో ఆవిరి పద్ధతిని ఉత్తమంగా పేర్కొంటారు. అయితే, ఆవిరి పట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సరైన విధానాన్ని అనుసరించకపోతే.. చర్మంపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు ఏర్పడి చర్మంపై మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. మరి ఆవిరి తీసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖం కడుక్కోవాలి.. ఆవిరి పట్టే ముందు ముఖం కడుక్కోవాలి. కానీ, చాలా మంది అలా చేయరు. తద్వారా ముఖ చర్మం రంద్రాల్లో ఉండే మురికి బయటకు వెళ్లకుండా ఉండిపోతుంది. అది మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది. అందుకే ఆవిరి పట్టే ముందు ముఖాన్ని కడగాలి.
ఆవిరి దగ్గరగా పట్టొద్దు.. ఎంత దగ్గరగా ఆవిరి తీసుకుంటే ముఖంలో మురికి అంత తొలగిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే, అలా ఎప్పుడూ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల చర్మం కాలిపోయి నల్లగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు, చర్మంపై కరుకుదనం ఏర్పడేందుకు దోహదపడుతుంది. ఆవిరిని తీసుకునే సమయంలో 8 సెంటీమీటర్ల దూరం ఉండాలి.
ఏవి పడితే అవి వేయకూడదు.. తులసి, లవంగం, గులాబీ ఆకులను ఒకేసారి వేసి ఆవిరి పట్టడం వల్ల ముఖం మరింత మెరుస్తుందని భావిస్తుంటారు. కానీ, అలా అస్సలు చేయొద్దట. ఆవిరి పట్టే సమయంలో ఒక పదార్థాన్ని మాత్రమే ఆ వేడి నీటిలో వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్టీమర్‌ను శుభ్రం చేయాలి.. ఆవిరి తీసుకున్న తర్వాత స్టీమర్‌ను సరిగ్గా శుభ్రం చేయాలి. అలా చేయకుండా మరోసారి వినియోగిస్తే.. లేని సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆవిరి పట్టే ముందు స్టీమర్‌ను శుభ్రం చేయడం చాలా అవసరం అని ఉద్ఘాటిస్తున్నారు.
Also read:
Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ
Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!