Marriage Loans: పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుకునేవారికి స్పెషల్ లోన్స్.. అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన బ్యాంక్..!
Marriage Loans: పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మీకోసం ప్రత్యేక రుణాలు ఇస్తోంది ప్రభుత్వం. పిల్లల సంఖ్యను
Marriage Loans: పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మీకోసం ప్రత్యేక రుణాలు ఇస్తోంది ప్రభుత్వం. పిల్లల సంఖ్యను బట్టి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారట. ఒకటీ రెండూ కాదు.. దాదాపు 23 లక్షల వరకూ రుణాలు ఇస్తారట. ఆగండాగండి… ఈ బంపర్ ఆఫర్ ఇక్కడ కాదు.. చైనాలో.. ఇలాంటి విచిత్రమైన పథకాలన్నీ అక్కడే అమలవుతాయి.. చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్ వివాహం చేసుకొని, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది. జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చన్న శాస్త్రవేత్తల అంచాతో అక్కడ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా పెంచే చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి వచ్చే జంటలు అక్కడ నివాసం పొందేందుకు అనుమతి కూడా ఇస్తోంది. అంతేకాదు వారికి అప్పటికే పిల్లలు ఉంటే వారు పబ్లిక్ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కూడా కల్పించింది. ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోడానికి వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. జిలిన్ ప్రావిన్స్ వ్యవసాయ పరంగా బాగా ప్రసిద్ధి చెందింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జనాభా గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా ఆర్థికవృద్ధిలో మందగమనం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్.. బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలను ప్రోత్సహించడంపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ఈ పథకం ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకి తెలిపింది.