Googld, Facebook: గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు 130 మిలియన్ల డాలర్ల జరిమానా.. ఎందుకంటే..

Googld, Facebook: స్థానిక చట్టం ద్వారా పరిమితం చేయబడిన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యా రాజధాని మాస్కోలోని కోర్టు శుక్రవారం గూగుల్‌కు, ఫేస్‌బుక్‌లకు..

Googld, Facebook: గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు 130 మిలియన్ల డాలర్ల జరిమానా.. ఎందుకంటే..
Follow us

|

Updated on: Dec 25, 2021 | 9:51 AM

Googld, Facebook: స్థానిక చట్టం ద్వారా పరిమితం చేయబడిన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యా రాజధాని మాస్కోలోని కోర్టు శుక్రవారం గూగుల్‌కు, ఫేస్‌బుక్‌లకు దాదాపు 130 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు కూడా కోర్టు 27.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ విధంగా, రెండు కంపెనీలకు సుమారు 130 మిలియన్ల డాలర్లు జరిమానా విధించబడింది. అయితే నిబంధనలకు సంబంధించి ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలపై రష్యా ఒత్తిడి పెంచుతోంది.

మాస్కో కోర్టు గూగుల్‌కు 7.2 బిలియన్ రూబిళ్లు జరిమానా విధించింది. మాస్కోలోని టాగన్‌స్కీ జిల్లా కోర్టు నిబంధనలకు విరుద్దంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని చెబుతున్నా గూగుల్‌ విస్మరించింది. గూగుల్‌కు దాదాపు 7.2 బిలియన్ రూబిళ్లు (దాదాపు 9.84 మిలియన్ల డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే టాగన్‌స్కీ జిల్లా కోర్టు నిర్ణయంపై గూగుల్ స్పందించింది. కోర్టు ఆదేశాలను అధ్యయనం చేసి, తదుపరి అంశాలపై నిర్ణయం తీసుకుంటామని గూగుల్ తెలిపింది.

ఫేస్‌బుక్ కూడా 272 మిలియన్‌ డాలర్ల జరిమానా: ఇక ఫేస్‌బుక్‌కు కూడా జరిమానా విధించింది కోర్టు. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు కోర్టు మెటా (ఫేస్‌బుక్)కి 1.9 బిలియన్ రూబిళ్లు (272 మిలియన్ల డాలర్లు) జరిమానా విధించింది. రష్యా అధికారులు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన విషయాలను తొలగించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు చాలాసార్లు జరిమానా విధించారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో జైలులో ఉన్న రష్యన్ ప్రభుత్వ విమర్శకుడు అలెక్సీ నవల్నీకి మద్దతుగా నిరసనల గురించి ప్రకటనలను తొలగించనందుకు అధికారులు సాంకేతిక కంపెనీలను నిందించారు. ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై రష్యాలోని వివిధ కోర్టులు ఈ సంవత్సరం జరిమానాలు విధించాయి. ఈ మూడు కంపెనీలూ అమెరికాకు చెందినవే.

ఇవి కూడా చదవండి:

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Telecom Companies: టెలికం కంపెనీలకు కొత్త నిబంధనలు.. యూజర్ల డేటా రెండేళ్ల పాటు ఉంచాలి: కేంద్రం