Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Kids PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డు అనేది ముఖ్యమైనది మారిపోయింది. బ్యాంకు ఖాతా, లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి...

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!
Pan Card
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2021 | 7:57 AM

Kids PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డు అనేది ముఖ్యమైనది మారిపోయింది. బ్యాంకు ఖాతా, లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి. ఒకప్పుడు పాన్‌ కార్డు కావాలంటే కనీసం నెలకుపైగా సమయం పట్టేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి లేదు. త్వరగా కార్డు వచ్చేస్తోంది. కేవలం పది నిమిషాల్లోనే కార్డు పొందవచ్చు. కానీ దీనిని అత్యవసరంగా మాత్రమే వాడుకోవచ్చు. ఒరిజినల్‌ కార్డు కావాలంటే వారం రోజుల్లో అడ్రస్‌కు వచ్చేస్తోంది. ఈ పాన్‌ కార్డు పెద్దలకు మాత్రమే ఉండగా, 18 సంవత్సరాల్లోపు ఉన్న వారు కూడా పొందే వేసులుబాటు ఉంటుంది.

పిల్లల పేరుపై కావాలంటే.. పాన్‌ కార్డు తీసుకోవాలంటే సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వారికి జారీ చేస్తారు. మీ పిల్లలకు పాన్‌ కార్డు కావాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కార్డును పొందాలంటే పలు విషయాలు గుర్తించుకోవాలి. పిల్లల పేరుపై పాన్‌ కావాలంటే తల్లిదండ్రులు వారి తరపున దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత అభ్యర్థి క్యాటగిరి ఎంచుకునే సమయంలో వ్యక్తిగత సమాచారం పూర్తిగా తెలుపాల్సి ఉంటుంది. కార్డు దారుడు మైనర్‌ అయి ఉంటే వయసు ధృవీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రుల ఫోటోతో, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో పిల్లల పేరుపై పాన్‌కార్డు తీసుకోవచ్చు. అందుకు రూ.107 ఛార్జిని చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లపై అప్‌లోడ్‌ చేసి, అందుకు రుసుమును చెల్లించి సబ్మిట్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు రషీదు నంబర్‌ వస్తుంది. ఈ నంబర్‌ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్‌ తనిఖీ చేసుకోవచ్చు. మీరు దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్‌ వస్తుంది. వెరిఫికేషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత మీకు 15 రోజుల్లో పాన్‌కార్డు అందుకుంటారు.

కావాల్సిన పత్రాలు: పాన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంటుంది. మైనర్ తల్లిదండ్రుల చిరునామా, దరఖాస్తుదారుని చిరునామా పత్రం అవసరం. అలాగే మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఈ డాక్యుమెంట్స్ అయిన ఆధార్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐ‌డిని సమర్పించాల్సి ఉంటుంది. ఇక అడ్రస్‌ వెరిఫికేషన్‌ కోసం మీ ఆధార్‌ కాపీ, పోస్టాఫీసు పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఒరిజినల్‌ రెసిడెన్సి సర్టిఫికేట్‌ అవసరమై ఉంటాయి. ఈ విధానం ద్వారా పిల్లల పేరుపై పాన్‌ కార్డు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

Electric Vehicle: ఒకాయ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్లు..!

Indian Railways: మీరు రైళ్లలో దూర ప్రయాణం చేస్తున్నారా..? కేవలం రూ.150లకు ఈ సదుపాయం..!

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?