Electric Vehicle: ఒకాయ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు..!
Electric Vehicle: ప్రస్తుతం ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి..
Electric Vehicle: ప్రస్తుతం ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకు తగినట్లుగానే కస్టమర్లు కూడా ఈవీ వాహనాల వైపు వెళ్తున్నారు. పోటా పోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు కంపెనీలు. ఇక ఒకాయ ఎలక్ట్రిక్ వాహనాలు తమ హై-స్పీడ్ ఈ-స్కూటర్ మార్కెట్లో విడుదల చేసింది. ఫాస్ట్ పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ.89,999 ఉన్నట్లు శుక్రవారం ఒకాయ పవర్ గ్రూప్ ఎండీ అనిల్ పేర్కొన్నారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రదర్శనలో దీనిని ఉంచారు. అయితే ఒకాయ ఎలక్ట్రిక్ వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల వద్ద రూ.1999 చె ల్లించి స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ గరిష్టంగా వేగం 60-70 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్ బ్యాటరీ 4.4 కిలోవాట్. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ.
ఇవి కూడా చదవండి: