Indian Railways: మీరు రైళ్లలో దూర ప్రయాణం చేస్తున్నారా..? కేవలం రూ.150లకు ఈ సదుపాయం..!
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ప్రయాణికుల కోసం డిస్పోజబుల్ బెడ్‌రోల్..
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ప్రయాణికుల కోసం డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన రైళ్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే శాఖ. కోవిడ్ మహమ్మారికి ముందు రైళ్లలో దుప్పట్లు, దిండ్లు అందించేవి. కరోనా వైరస్ కారణంగా ఆ సదుపాయాన్ని నిలిపివేశారు.
అయితే సర్వీస్ ఉపయోగించడానికి ప్రయాణికులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర జోన్ల వారీగా వేర్వేరుగా ఉంటుంది. రైల్వే అధికారులు అందించే కిట్‌లో 48 x 75 అంగుళాల బెడ్ షీట్, 54 x 78 అంగుళాల బ్లాంకెట్, ఎయిర్ పిల్లో, పిల్లో కవర్, ఫేస్ టవల్ లేదా న్యాప్‌కిన్, మూడు ఫేస్ మాస్కులు లభిస్తాయి. కొన్ని జోన్స్‌లో వీటితో పాటు టూత్ పేస్ట్, శానిటైజర్ కూడా ఈ కిట్‌లో లభిస్తున్నాయి.
రైలులో మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్‌కిట్‌లు అందుబాటులో ఉంటాయి. బెడ్‌షిట్, దిండు, దాని కవర్స్, డిస్పోజబుల్ బ్యాగు, టూత్‌పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్, సబ్బు, టిష్యూ పేపర్లు ఉంటాయి. ఈ కిట్ ధర రూ.300గా నిర్ణయించింది రైల్వే శాఖ. ఒక వ్యక్తి ఒక దుప్పటిని మాత్రమే కావాలంటే రూ.150 చెల్లిస్తే బెడ్‌రోల్ కిట్ అందించే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించింది రైల్వే శాఖ. ప్రస్తుతం ఈ సదుపాయం కొన్ని రైళ్లలో మాత్రమే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మాత్రమే ఈ సేవలను అందించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, ముంబై-ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, పశ్చిమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సదుపాయం ఉంది.
ఇవి కూడా చదవండి: