Watch video: నాకే బీరు, బిర్యానీ ఇయ్యవా..! రెచ్చిపోయి దాడి చేసిన ఖాకీ.. వీడియో వైరల్..
ముంబైలో ఖాకీ రెచ్చిపోయాడు. దాడి చేశాడు. క్యాషియర్‌ను చితకబాదాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో..

ముంబైలో ఖాకీ రెచ్చిపోయాడు. దాడి చేశాడు. క్యాషియర్‌ను చితకబాదాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అసలు కథ బయటకొచ్చింది. ఎందుకు దాడి చేశాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. హోటల్‌లోని క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చిన వచ్చిన పోలీసులు.. తమకు ఫ్రీ ఫుడ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్లితే.. వకోలా పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న స్వాగత్ డైనింగ్ బార్ నుంచి ఏపీఐ విక్రమ్ పాటిల్ భోజనం, మద్యం కోసం ఆర్డర్ చేశాడు. అయితే ఆ రోజు మెస్ క్లాజ్ అంటూ క్యాషియర్ రాందాస్ పాటిల్ తెలిపాడు.
పాటిల్ వెనుక డోర్ నుంచి హోటల్‌లోకి చొరబడి క్యాషియర్‌ను దూషించాడు. ఇందంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఫుటేజీలో అతను క్యాషియర్ చొక్కా లాగి, అతనిని పలుమార్లు కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే హోటల్ సిబ్బంది అతనిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయినా ఖాకీ రెచ్చిపోయాడు.
ఆ తర్వాత జరిగిన ఘటన గురించి తెలుసుకున్న హోటల్ మేనేజర్.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. రాందాస్ ఫిర్యాదు ఆధారంగా వకోలా పోలీసులు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 323 (గాయపరచడం) కింద నాన్-కాగ్నిజబుల్ (NC) నేరాన్ని నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై వకోలా డివిజన్‌లోని ఏసీపీ విచారణకు ఆదేశించారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించబడింది. ఇలాంటి ఘటనలు ముంబై లాంటి పెద్ద నగరంలో కామన్ అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.
He is API Vikram Patil, attached to Vakola Pol Stn of @MumbaiPolice, who is seen hitting the cashier of #Swagat restaurant at 12.35 am because the manager refused to give him FREE food and DRINK as the kitchen had closed: #AHAR #dadagiri #highhandedness #shameful pic.twitter.com/3WrD9FocVM
— Diwakar Sharma (@DiwakarSharmaa) December 23, 2021
ఇవి కూడా చదవండి: ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..




