Petrol, Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!

Petrol, Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతుండగా...

Petrol, Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2021 | 9:26 AM

Petrol, Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్నపాటి హెచ్చు.. తగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో ప్రభావం కనిపించింది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలోని నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.100 పైనే కొనసాగుతోంది. దేశంలో చమురు ధర ఇప్పటికీ సామాన్యుల జేబులపై ప్రభావం చూపుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు.. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67 ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. అదే సమయంలో చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.100.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.01 ఉంది.

తెలంగాణలో.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.97 ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఏపీలో.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.35కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.44లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.54లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.64గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.49గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.96.57 ఉంది.

ఇక మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోండి. మీరు SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. మీరు RSP మరియు మీ సిటీ కోడ్‌ని నమోదు చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది. మీరు ఎస్‌ఎంఎస్‌ చేసిన వెంటనే ధరల వివరాలు వస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర అంశాలను జోడించిన తర్వాత దాని ధరలలో మార్పులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Electric Vehicle: ఒకాయ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్లు..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?