Pakistan PM: ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని వేచి చూస్తున్నా అంటూ పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Pakistan PM: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్‌కి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకుంటానని అంటారు.. అయితే..

Pakistan PM: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్‌కి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకుంటానని అంటారు.. అయితే ఇమ్రాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని వేచి చూస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న 71 ఏళ్ల నవాజ్ ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం లాహోర్‌లో జరిగిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సమావేశంలో నవాజ్ ఆన్ లైన్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ‘తోలుబొమ్మ’ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాదు అమెరికాలో ఇమ్రాన్ కు మేయర్ కి ఇచ్చే విలువ కూడా ఇవ్వరని అన్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఎలా అధికారంలోకి వచ్చారో ప్రపంచానికి తెలుసు… ఇమ్రాన్ సామాన్యుల ఓట్లతో కాకుండా సైనిక వ్యవస్థ సహాయంతో అధికారంలోకి వచ్చారని చెప్పారు నవాజ్. అప్పటి పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు తీసుకుంటోందని ఇమ్రాన్ తీవ్రంగా విమర్శించారు. అయితే ఇప్పుడు పాక్ ప్రధానిగా అధికారం చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ఏమి చేస్తున్నారు. గత మూడేళ్లలో ఇమ్రాన్ 34 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నాడని తెలిపారు నవాజ్.
2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ మొదటి సంవత్సరాల్లోనే విదేశీ ప్రభుత్వాలు , సంస్థల నుండి US$34 బిలియన్లకు పైగా అప్పులు తీసుకుంది. నయా పాకిస్థాన్ పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ లాంటి అసమర్థులకు పదవి అప్పగించారని షరీఫ్ అన్నారు. రాజ్యాంగాన్ని ఎన్నడూ అత్యున్నతంగా పరిగణించకపోవడమే.. ప్రమాణాన్ని గౌరవించకపోవడమే దేశ పతనానికి కారణమని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని కూడా తాకట్టు పెట్టారని షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ సుభిక్షం వైపు పయనించాలంటే, గతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
అయితే నవాజ్ షరీఫ్ రెండు అవినీతి కేసుల్లో దోషిగా నిర్ధారించారు. అయితే గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయనకు చికిత్స నిమిత్తం లాహోర్ హైకోర్టు విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఆయన నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.
Also Read: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..నేలపాలైన ఉక్కు ద్రవం..రెండు లారీలు దగ్ధం