AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ

Sushmita Sen Break Up: మాజీ విశ్వసుందరి, ప్రముఖ నటి సుస్మితా సేన్ తన వ్యక్తిగత విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ
Susmitha Sen
Shiva Prajapati
|

Updated on: Dec 25, 2021 | 10:03 AM

Share

Sushmita Sen Break Up: మాజీ విశ్వసుందరి, ప్రముఖ నటి సుస్మితా సేన్ తన వ్యక్తిగత విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియుడు రోహ్మన్ షాల్ తో తన మూడేళ్ల బంధం ముగిసినట్లు ఆమె ప్రకటించారు. రోషన్‌, సుస్మిత 2018లో సోషల్‌ మీడియాలో ఒకరినొకరు పరిచయమయ్యారు. అప్పటినుంచి అతనితో డేటింగ్ లో ఉన్నట్టు సుస్మిత అధికారికంగా వెల్లడించారు. ఆ సమయంలో వీరిద్దరూ కుటుంబపరమైన కార్యక్రమాల్లో, బహిరంగ ప్రదేశాల్లోనూ జంటగా కనిపించేవారు.

కాగా ఇటీవల కొంతకాలంగా సుస్మిత, రోహ్మన్ రిలేషన్ షిప్ పై ఊహాగానాలు బయల్దేరాయి. వీరిద్దరూ విడిపోనున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ సుస్మిత ఇన్ స్టాగ్రామ్‌లో తన బ్రేకప్ ను నిర్ధారించారు. “స్నేహితులుగా మా ప్రస్థానం మొదలైంది. స్నేహితులుగానే ఉంటాం. మా మధ్యన బంధం ముగిసినా ప్రేమ మాత్రం అలాగే ఉంది” అని పేర్కొన్నారు. భారత్ లో మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న రోహ్మన్ షాల్ సుస్మితకన్నా వయసులో 15 ఏళ్లు చిన్నవాడు. కాగా, రోష్మన్‌ను ఎంతగానో ఆరాధించే సుస్మిత ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Home Loan Tips: హోమ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!

Jammu kashmir Encounter: షోపియాన్‌లో కాల్పుల మోత.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..