Unstoppable With NBK: పుష్పరాజ్‏గా మారిన బాలయ్య.. అల్లు అర్జున్ ముందు తొడకొట్టి తగ్గేదే లే అంటూ రచ్చ..

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‏లో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టాడంటూ

Unstoppable With NBK: పుష్పరాజ్‏గా మారిన బాలయ్య.. అల్లు అర్జున్ ముందు తొడకొట్టి తగ్గేదే లే అంటూ రచ్చ..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2021 | 9:53 AM

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‏లో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టాడంటూ ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విధానానికి ప్రజలు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా 200 వందల క్లబ్‏ను క్రాస్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియాలో తగ్గేదే లే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక ఇదే మాస్ డైలాగ్‏ను నందమూరి నటసింహం బాలకృష్ణ చెబితే ఎలా ఉంటుంది ?.. వీరలెవల్ కదా..

అచ్చం పుష్పరాజ్‏ను ఇమిటేట్ చేస్తూ తొడకొట్టి మరీ తగ్గేదే లే డైలాగ్‏తో అదుర్స్ అనిపించారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ద్వారా ప్రేక్షకులకు అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రవితేజ, బోయపాటి శ్రీను, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, రాజమౌళి వంటి వారిని తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసిన ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. ఇక తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, రష్మిక మందన్నా విచ్చేశారు. వీరి ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

అందులో బన్నీ, బాలయ్య ఇద్దరూ పుష్పరాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదే లే.. అంటూ తమదైన డైలాగ్ ఇరగదీశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?