ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Radhe Shyam: సౌత్ ఫిల్మ్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో గొప్ప చిత్రం రాబోతోంది. దీని పేరు 'రాధే శ్యామ్'. ఈ సినిమా కోసం జనాలు చాలా కాలంగా

ప్రభాస్ 'రాధే శ్యామ్' సరికొత్త రికార్డ్‌..  24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు
Radhe Shyam
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2021 | 6:55 AM

Radhe Shyam: సౌత్ ఫిల్మ్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో గొప్ప చిత్రం రాబోతోంది. దీని పేరు ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం జనాలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ అద్బుతంగా ఉందని టాక్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో ప్రభాస్ చాలా డాషింగ్‌గా, పూజా చాలా అందంగా కనిపించారు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 14, 2022న విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ నటించిన ఈ సినిమాలో చాలా గొప్ప సన్నివేశాలు ఉన్నాయి. అవి చూస్తే మీరు షాక్ అవుతారు. మీరు ఇంతకు ముందెన్నడూ వినని డైలాగులు ఈ సినిమా ట్రైలర్‌లో వినొచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్‌ను గొప్ప జ్యోతిష్కుడిగా అభివర్ణించారు. అతడికి వర్తమానం నుంచి భవిష్యత్తు వరకు ప్రతిదీ తెలుసు. ఈ విషయాన్ని సినిమా ట్రైలర్‌లో చెప్పేశారు.

ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన హస్తసాముద్రికుడు (జ్యోతిష్యుడు). ప్రభాస్‌ని కలిసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యక్తులు, నాయకులు వరుస కట్టడం ట్రైలర్‌లో చూడవచ్చు. అయితే జ్యోతిష్యుడు ఓ అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసిన తర్వాతే మీకే తెలుస్తుంది. కానీ బయటకు వస్తున్న ఒక వార్త ఏంటంటే ప్రభాస్ చిత్రం ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కేవలం 24 గంటల్లో 64 మిలియన్ల+ రియల్ టైమ్ వ్యూస్‌ను దాటింది. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, టి-సిరీస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీని గురించి రాసింది.

View this post on Instagram

A post shared by T-Series (@tseries.official)

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

80 దేశాల్లో 1512 స్క్రీన్‌లలో విడుదలైన 83 చిత్రం.. భారీ వసూళ్ల దిశగా పరుగులు..