Aha: సినిమాపురం బయలుదేరిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘ఆహా’ అందిస్తున్న సరికొత్త కాన్సెప్ట్..

మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా.

Aha: సినిమాపురం బయలుదేరిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 'ఆహా' అందిస్తున్న సరికొత్త కాన్సెప్ట్..
Aha
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2021 | 9:34 PM

Aha: మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఎల్ల‌ప్పుడూ అందిస్తామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులకు సంతోషాన్ని అందిస్తూ అల‌రిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు – ఒరిజినల్ వెబ్ సిరీసులు – సరికొత్త టాక్ షోలతో ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని అందిస్తోంది. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆహా. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కార్ వ్యాన్ ఓ విచిత్రమైన ఊరి కి వెళ్తున్నామని బన్నీ మేనేజర్ చెప్పగా.. విచిత్రమైన ఊరా ఏంటది అది బన్నీ అడుగుతాడు. సినిమాపురం.. ఈ ఊరిలో ఉన్నవాళ్లకు సినిమా పిచ్చి.. అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ సినిమా చూడకుండా ఉండలేరు అని చెప్తాడు మేనేజర్. ఇంతలో ఊరికి ముందు చెక్ పోస్ట్ పడుతుంది. బన్నీ మేనేజర్ దిగి ఊరికి ముందు చెక్ పోస్ట్ ఏంటి అని అడిగింతే.. శనివారం మొదటి ఆట అయ్యేవరకు సినిమాపురంకు  సెలవు అని బోర్డు మీద రాసి ఉంటుంది. అదేంటి అని మేనేజర్ అడగ్గా ఇది సినిమా పురం అని ఓ పెద్దాయన అంటాడు.. ఇంతలో బన్నీ వ్యాన్ నుంచి దిగుతాడు. దాంతో ఈవీడియో ముగుస్తుంది.. సినిమా ఇంకా బాకీ ఉంది అని చూపించారు.. ఇంతకు ఇదేంటి.. వెబ్ సిరీస్‌నా.. లేక సినిమానా..? మరేదైనా గేమ్ షోనా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..