RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

RBI: MUFG బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 30 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా రెగ్యులేటరీ లోపాల కారణంగా రెండు సహకార

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?
Rbi
Follow us
uppula Raju

|

Updated on: Dec 24, 2021 | 11:02 PM

RBI: MUFG బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 30 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా రెగ్యులేటరీ లోపాల కారణంగా రెండు సహకార బ్యాంకులపై కూడా రూ.2 లక్షల జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. నిబంధనలను పాటించనందుకు ఈ బ్యాంకులకు జరిమానా విధించామని ప్రకటించింది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ సూచనలను పాటించనందుకు బ్యాంక్‌పై పెనాల్టీ విధించింది. MUFG బ్యాంక్‌ని గతంలో ది బ్యాంక్ ఆఫ్ టోక్యో-మిత్సుబిషి UFJ, లిమిటెడ్ అని పిలిచేవారు.

తనిఖీ సందర్భంగా బ్యాంకులో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత బ్యాంకుకు నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణ నిజమని RBI గుర్తించి ఆ తర్వాత జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మూడు కేసుల్లోనూ రెగ్యులేటరీ లోపాలపై పెనాల్టీ ఆధారపడి ఉంటుందని, బ్యాంకులు తమ ఖాతాదారులతో కుదుర్చుకున్న ఎలాంటి లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుపై ప్రభావం చూపదని RBI ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ నిన్న ఇద్దరు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, వన్ మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీ లిమిటెడ్‌పై ఒక్కొక్కరికి కోటి రూపాయల జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను పేమెంట్ ఆపరేటర్లు పాటించనందున వన్ మొబిక్విక్, స్పైస్ మనీపై పెనాల్టీ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. గత వారం ఆర్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రూ.1.8 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌పై రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కోటి రూపాయల జరిమానా విధించింది. ఎందుకంటే కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ముప్పై శాతానికి పైగా షేర్లను SBI తాకట్టు పెట్టినట్లు తేలింది.

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం ఎంత పనిచేసింది..! కన్న తండ్రినే పోలీసులకు పట్టించేలా చేసింది..

PM Modi: పాడి రైతులకు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్‌.. బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపన..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.