Home Loan Tips: హోమ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Home Loan Tips: వ్యక్తిగత రుణాలలో హోమ్ లోన్ పెద్ద రుణం. ఇది 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉంటుంది.

Home Loan Tips: హోమ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Home Loans
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2021 | 10:03 AM

Home Loan Tips: వ్యక్తిగత రుణాలలో హోమ్ లోన్ పెద్ద రుణం. ఇది 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉంటుంది. ఈ కారణంగా గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారు దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతను మోసేందుకు సిద్ధంగా ఉండాలి. బ్యాంకులు రుణగ్రహీత క్రెడిట్ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. కావున.. గృహ రుణం తీసుకునే ముందు ఈ నాలుగు విషయాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి.

లోన్ అప్లికేషన్‌కు ముందు డౌన్ పేమెంట్ చేయాలి.. ఆర్‌బీఐ బ్యాంకులకు ఆస్తి విలువలో 75 నుంచి 90 శాతం వరకు గృహ రుణాల మంజూరుకు అనుమతించింది. అయితే, ఎవరైతే హోమ్‌లోన్ కోసం అప్లై చేయాలని భావిస్తారో..వారు డౌన్ పేమెంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని స్వయంగా డిపాజిట్ చేయాలి. అది డౌన్ పేమెంట్ అయినా, మార్జిన్ కాంట్రిబ్యూషన్ అయినా సరే. ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణం తీసుకోవాలనుకునే వారు రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు రుణ మొత్తం విలువలో 10 నుండి 25 శాతం వరకు సమకూర్చుకోవాలి. రుణగ్రహీతలు డౌన్ పేమెంట్ డిపాజిట్ చేస్తే.. గృహ రుణ వడ్డీ రేట్‌ను తగ్గించే అవకాశం ఉంది. అధిక డౌన్ పేమెంట్ క్రెడిట్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఎక్కువ డౌన్ పేమెంట్ చేసే వ్యక్తులకు సులభంగా హోమ్ లోన్ ఆమోదం లభిస్తుంది.

క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించండి.. రుణ దరఖాస్తును అంచనా వేసేటప్పుడు బ్యాంకులు వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. వీరి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా అంటే 750 కంటే ఎక్కువగా ఉంటే.. వారికి హోమ్ లోన్ సులభంగా లభిస్తుంది. కొన్ని బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోర్లు ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి.

ఈఎంఐ చెక్ చేసుకోండి.. నెలవారీ చెల్లింపులు చేసే వారికి బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి. దీంతో కొత్త ఇంటి కోసం తీసుకున్న రుణంలో ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లిస్తే.. రుణం పొందడం ఈజీ అవుతుంది. నెలవారీ ఆదాయంలో 50 నుంచి 60 శాతం ఉంటే రుణం పొందడం సులువు అవుతుంది. ఆ పరిమితి తక్కువగా ఉంటే.. రుణాన్ని కూడా తక్కువ తీసుకోవడం మంచిది. లేదంటే.. దరఖాస్తుదారులు.. ఈఎంఐ కాల పరిమితిని పెంచుకుంటే సరిపోతుంది.

అత్యవసర నిధిపై దృష్టి పెట్టండి.. ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆదాయ నష్టం ఒక వ్యక్తి రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావితం చూపుతుంది. గడువు తేదీలోగా హోమ్ లోన్ EMI చెల్లించడంలో విఫలమైతే భారీ జరిమానా విధించబడుతుంది. దీంతో ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. దీన్ని నివారించడానికి, అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

Also read:

Home Loan Tips: హోమ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!

Jammu kashmir Encounter: షోపియాన్‌లో కాల్పుల మోత.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..