Jammu kashmir Encounter: షోపియాన్‌లో కాల్పుల మోత.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..

Jammu kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు

Jammu kashmir Encounter: షోపియాన్‌లో కాల్పుల మోత.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..
Encounter
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2021 | 10:10 AM

Jammu kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు. షోపియాన్‌లోని చౌగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. చౌగామ్‌లో ఉగ్రవాదుల ఉనికిని గుర్తించిన భద్రతా బలగాలు, పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

ఇక శుక్రవారం తెల్లవారుజామున, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ముమన్‌హాల్ (అర్వానీ) ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాది నుంచి AK-47ను స్వాధీనం చేసుకున్నారు.

పౌరులను కూడా టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. జమ్మూ కాశ్మీర్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. ఉగ్రవాదులు నిత్యం సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూనే పోలీసు సిబ్బందిపై కూడా దాడులు చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో బుధవారం జరిగిన ఉగ్రదాడుల్లో ఒకరు మృతి చెందగా, మరో దాడిలో పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

Also read:

Home Loan Tips: హోమ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!

Jammu kashmir Encounter: షోపియాన్‌లో కాల్పుల మోత.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!