- Telugu News Photo Gallery Business photos Year Ender 2021: Top 9 Electric Cars for the Year 2021.. and Features, Price Details
Year Ender 2021: ఈ సంవత్సరంలో విడుదలైన టాప్ – 9 ఎలక్ట్రిక్ కార్లు.. ఫీచర్స్, ధర వివరాలు
Year Ender 2021: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఈ ఎలక్ట్రిక్ కార్లు వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాదిలో వచ్చిన టాప్-9 ఎలక్ట్రిక్ కార్లను మీకు అందిస్తున్నాము...
Updated on: Dec 25, 2021 | 11:27 AM

ఆడి ఈ-ట్రాన్: జన్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ అడి ఈ-ట్రాన్ పేరిట మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్లో విడుదల చేసింది. ఈ-ట్రాన్50 మోడల్ ధర రూ.99.99 లక్షలు కాగా, ఈ-ట్రాన్55 రూ.1.16 కోట్లు (ఎక్స్‌షోరూమ్), ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్55 రూ.1.18 కోట్లు (ఎక్స్‌షోరూమ్). ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే కెపాసిటి ఉంది. వీటికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 359-484 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

బీఎండబ్ల్యూ ఐఎక్స్: బీఎండబ్ల్యూ నుంచి ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.1.16 కోట్లు, ఈ కారును బుక్ చేసుకున్న వారికి 2022 ఏప్రిల్‌లో డెలివరీ చేయనుంది కంపెనీ. ఈ కారు 6.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రెండున్న గంటల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

కోనా ఎలక్ట్రిక్: ఇక హ్యుందాయ్ కంపెనీ నుంచి తయారైన కోనా ఎలక్ట్రిక్ కారు. ఈ కారు టిబెట్‌లోని సావులా కొండల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి గిన్నిస్ రికార్డులో స్థానం సాధించింది. స్టాండర్డ్ పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఇది దానికదే రీఛార్జి చేసుకుంటుంది. ఇందులో 39.2 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 452 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని ధర రూ.23.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

జాగ్వార్ ఐ-పేస్: టాటా గ్రూప్ ఆధ్‌వర్యంలో వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌భారత్‌లో ఐ-పేస్ పేరిట మొదటి ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.1.06 కోట్లు. ఇది 294 కేవీ శక్తిని, 696 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు సదుపాయాలున్నాయి.

మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్: జర్మనీలో ఇంటర్నేషనల్ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్ బెంజ్ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో మెర్సిడిజ్ ప్రదర్శనకు ఉంచింది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క సారి ఛార్జింగ్ తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ తెలిపింది. ఈ కారులో 90కేడబ్ల్యూహెచ్ (kWh) బ్యాటరీ పొందుపర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించనుంది. కారు ఈ ఏడాది విడుదలైనప్పటికీ.. ఇంకా డెలివరీలు ప్రారంభించలేదు.

ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఈవీ: ఎంజీ మోటార్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జెడ్‌ఎస్ ఈవీ. ఎక్సైట్ వేరియంట్ కారు ధర రూ.20.88 లక్షలు ఉండగా, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.23.58 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 44.5 కిలోవాట్స్ శక్తి గల బ్యాటరీని పొందుపర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 340 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు 40 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ వాహనం కేవలం 8 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.

పోర్షే టేకాన్: జన్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ పోర్షే నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది భారత్‌లో విడుదలైంది. దీని ధర రూ. 1.5 కోట్ల నుంచి రూ.2.30 కోట్ల వరకు నిర్ణయించింది కంపెనీ. ఈ కంపెనీ నాలుగు మోడళ్లలో విడుదల చేసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కస్టమర్లకు అందించనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456-484 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు: ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా నెక్సాన్. దీనికి భారత్‌లో మంచి ఆదరణ ఉంది. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో బ్యాటరీతో పాటు ఇతర అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.

టాటా టిగోర్: టాటా మోటార్స్ నుంచి వచ్చిన రెండో ఎలక్ట్రిక్ కారు టిగోర్ ఈవీ. దీని ధర రూ.11.99 లక్షల నుంచి రూ.13.14 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అభ్యమవుతుంది. అందులో ధరలను పరిశీలిస్తే వరుసగా రూ.11.99 లక్షలు, రూ.12.49 లక్షలు, రూ.12.99 లక్షలుగా ఉన్నాయి. కంపెనీ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ జిప్ట్రాన్ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. 55 కిలోవాట్ల గరిష్ఠ సామర్థ్యం, 170 ఎన్‌ఎం టార్క్, 26 కిలోవాట్‌అవర్ లిక్విడ్-కూల్డ్, అధిక శక్తిమంత ఐపీ 67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ఈ మోడల్‌లో ఉంది.




