Oreo Biscuit cake: ఓవెన్ అవసరం లేకుండా ఓరియో బిస్కట్స్‌తో రుచికరమైన ఎగ్‌లెస్ కేక్.. రెసిపీ.. మీ కోసం..

Oreo Biscuit cake: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ప్రముఖ ప్లేస్ ను సొంతం చేసుకుంది కేక్. అయితే ఈ కేక్ ను బేకరీలో కొనడానికి బదులు.. ఇంట్లోనే స్వయంగా తయారు చేస్తే ఎంతో ఆనందం మీ..

Oreo Biscuit cake: ఓవెన్ అవసరం లేకుండా ఓరియో బిస్కట్స్‌తో రుచికరమైన ఎగ్‌లెస్ కేక్.. రెసిపీ.. మీ కోసం..
Oreo Biscuit Cake
Follow us

|

Updated on: Dec 25, 2021 | 11:59 AM

Oreo Biscuit cake: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ప్రముఖ ప్లేస్ ను సొంతం చేసుకుంది కేక్. అయితే ఈ కేక్ ను బేకరీలో కొనడానికి బదులు.. ఇంట్లోనే స్వయంగా తయారు చేస్తే ఎంతో ఆనందం మీ సొంతం. అంతేకాదు బేకరీలో లభించే కేక్ టెస్ట్ తో ఇంట్లోనే సింపుల్ గా వెరైటీ ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్‌ప్రైజ్ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు కూడా.. అయితే ఓరియో బిస్కెట్  తో జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోయే , కిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్స్ కేక్ తయారు చేసే విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

ఓరియో బిస్కెట్ -ఒక పేకేట్ పాలు – ఒక కప్పు ఈనో -ఒక పేకెట్ గిన్నె నూనె లేదా నెయ్యి కొంచెం మైదా డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో ఓరియో బిస్కెట్ ను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అనంతరం పాలు ఈనో పేకట్ వేసుకుని మిక్సీ పట్టాలి. తర్వాత కేక్ తయారు చేసుకోవడానికి ఒక దళసరి గిన్నెను తీసుకుని దాని అంచులకు చుట్టూ.. నెయ్యి లేదా నూనె పూయాలి. తర్వాత మైదా గిన్నె చుట్టూ చల్లాలి. అప్పుడు మిక్సీ పట్టుకున్న ఓరియో బిస్కెట్ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని.. బబుల్స్ లేకుండా చేసుకోవాలి. (ఇష్టమైన వారు ఈ మిశ్రమంపై డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు) తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో ఉప్పు లేదా ఇసుక వేసుకోవాలి. చదునుగా పరుచుకుని.. అందులో గిన్నె నిలబడానికి ఒక చిన్న స్టాండ్ లేదా ప్లేట్ ను పెట్టుకుని.. దానిపై.. ఓరియో బిస్కెట్ మిశ్రమాన్ని ఉన్న గిన్నెలు పెట్టుకుని మూత పెట్టుకుని.. ఒక 30 నిముషాలు స్విమ్ లో ఉడికించాలి. అనంతరం.. కేక్ ఉడికిందో లేదో చూసుకుని.. అంచులు చుట్టూ జాగ్రత్తగా లూజ్ చేసుకుని.. గిన్నె నుంచి మరొక ప్లేట్ లోకి తీసుకుంటే.. ఓరియో బిస్కెట్ స్పాంజ్ కేక్ రెడీ..

Also Read:   నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి.. ప్రధాని మోడీ సహా పలువురు ఘన నివాళులు..