బిలోనా నెయ్యి Vs సాధారణ నెయ్యి.. ఈ రెండింటిలో ఏది మంచిది.. ఆరోగ్యకరమైనది..?
Bilona ghee Vs regular ghee: బిలోనా అనేది నెయ్యిని తయారుచేసే పద్ధతిని సూచిస్తుంది. ఇక్కడ బిలోనా' అని పిలిచే ఒక చెక్కని పెరుగు నుంచి వెన్నని బయటకు
Bilona ghee Vs regular ghee: బిలోనా అనేది నెయ్యిని తయారుచేసే పద్ధతిని సూచిస్తుంది. ఇక్కడ బిలోనా’ అని పిలిచే ఒక చెక్కని పెరుగు నుంచి వెన్నని బయటకు తీయడానికి ఉపయోగిస్తారు. తర్వాత నెయ్యి తయారు చేయడానికి వెన్నను నెమ్మదిగా మంటపై వేడి చేస్తారు. ఇది నెయ్యి తయారీలో ఒక పురాతన పద్ధతి. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు మోటార్ చర్నర్లను ఉపయోగిస్తున్నారు. బిలోనా నెయ్యి అంటే పెరుగును చిదిమి తయారు చేస్తారు. సాధారణ నెయ్యి మలై లేదా పాలను సేకరించడం ద్వారా తయారు చేస్తారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బిలోనా నెయ్యి రుచికరమైనది ఆరోగ్యకరమైనది. మంచి సువాసన కలది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ DHA, ఒమేగా-6 (CLA), మోనో-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (MUFA) ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం.. బిలోనా నెయ్యి మానవ శరీరంలోని వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ నెయ్యిలో ఉండే బ్యూటిరేట్ శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బిలోనా నెయ్యిలోని DHA, CLA జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇది అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బిలోనా నెయ్యిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైనది. ఇందులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. ఇది కాల్షియం, ఫాస్పరస్ శోషణకు సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, బిలోనా నెయ్యితో మోకాలి మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.