Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frozen Foods: గడ్డకట్టిన ఆహార పదార్థాలను తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

Frozen Food Side Effects: ఉరుకుపరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని

Frozen Foods: గడ్డకట్టిన ఆహార పదార్థాలను తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..
Frozen Foods
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 26, 2021 | 12:44 PM

Frozen Food Side Effects: ఉరుకుపరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటారు. అయితే ఇది కొంతమందికి తప్పదు. అయితే.. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం కానీ.. ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవనశైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి. పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే.. బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్‌లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా.. నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇలా నిల్వఉంచిన, లేదా గడ్డకట్టిన, చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా..? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంత మందికి తెలుసు. వాస్తవానికి ఆహారాన్ని కొంత కాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకోండి..

గుండె వ్యాధులు గడ్డకట్టిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్టుల ప్రకారం.. ఫ్రోజెన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్, లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65 శాతానికి పైగా ఉంది. అంతే కాదు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది. కావున ఫ్రోజెన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు నిపుణులు.

బరువు పెరుగడం సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో రెండు రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి.

మధుమేహం గడ్డకట్టిన ఆహారాల్లో ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం జీర్ణం కాకముందే, ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతే కాదు దీని వల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Kanpur IT Raid: హమ్మయ్య లెక్క తేలిందోచ్.. కట్టల గుట్టలు లెక్కించేందు మూడు రోజులు పట్టింది..

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..