Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..

Student Gang-raped in UP: నేరాలకు, మహిళలపై అఘాయిత్యాలకు కేరాప్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..
rape case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 26, 2021 | 11:27 AM

Student Gang-raped in UP: నేరాలకు, మహిళలపై అఘాయిత్యాలకు కేరాప్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం ట్యూషన్ వెళ్లింది. ఈ క్రమంలో అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారు. ఆ తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. బాలిక రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని గుర్తించారు. అనంతరం ఆమెను ఆసుపపత్రికి తరలించి చికిత్స అందించారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత విద్యార్థిని తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జనసత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బబ్లూ సింగ్ వర్మ పేర్కొన్నారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే.. బాలికకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని.. నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. హాస్టల్‌ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం.. 

Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..

ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..