ఒత్తిడితో బాధపడుతున్నారా..? కేవలం 10 నిమిషాల్లోనే ఇలా చెక్ పెట్టేయండి..!
మనం ప్రతిరోజూ ఒత్తిడి కి లోనవుతున్నాము. పని, కుటుంబ సమస్యలు, ఆర్థిక భారం వల్ల మనసు నిద్రలేమి, గుండె సమస్యల కు గురవుతుంది. అయితే రోజులో కేవలం 10 నిమిషాలు కేటాయించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక్కోసారి కోపం, భయం లాంటి వాటి వల్ల అప్పటికప్పుడు ఒత్తిడి వస్తే.. మరికొన్నిసార్లు ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల చాలా కాలం పాటు ఉంటుంది. ఈ ఒత్తిడిని వీలైనంత త్వరగా తగ్గించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు.
మన మనసు ఆరోగ్యం మన శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఒత్తిడి వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుండె డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి. అవి గట్టిపడతాయి. దీని వల్ల గుండెకు రక్తం సరిగా అందక హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం.
మీరు ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజులో కేవలం 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. ఉదాహరణకు ఎవరి కోసమైనా ఎదురుచూసేటప్పుడు లేదా కారులో కూర్చున్నప్పుడు ఈ సమయాన్ని వాడుకోవచ్చు. ఆ 10 నిమిషాలు మీ ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేసి.. అన్నింటికీ దూరంగా ఉండండి. ఇలా రోజుకు ఒక్కసారి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడికి చెక్ పెట్టే చిట్కాలు
- ఫోన్ కి దూరం.. రోజుకు కనీసం 10 నిమిషాలైనా ఫోన్‌కి దూరంగా, ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో మీ చుట్టూ జరిగే విషయాలపై దృష్టి పెట్టండి.
- శ్వాస మీద ధ్యాస.. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండండి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
- వాకింగ్.. నడుస్తూ మీకు ఇష్టమైన పాటలు లేదా పాడ్‌కాస్ట్స్ వినండి. ఇది మీ మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.
ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే.. మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.




