Hair Loss: ఈ తప్పులు చేయడం వల్ల జుట్టు రాలిపోతుందట.. జాగ్రత్త!
జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అందరికీ ఇష్టమే. మగవారికైనా, ఆడవారికైనా జుట్టే ఆకర్షణగా.. అందంగా కనిపిస్తుంది. అయితే నేటి కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా మంది మార్కెట్లో లభించే ప్రతి హెయిర్ ప్రోడెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితం లభించదు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా..
జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అందరికీ ఇష్టమే. మగవారికైనా, ఆడవారికైనా జుట్టే ఆకర్షణగా.. అందంగా కనిపిస్తుంది. అయితే నేటి కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా మంది మార్కెట్లో లభించే ప్రతి హెయిర్ ప్రోడెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితం లభించదు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా హెయిర్ లాస్ అవుతుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంతే కాకుండా ఒత్తిడి, కాలుష్యం వల్ల కూడా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతాయి. కొన్ని రకాల పద్దతుల వల్ల కూడా జుట్టు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి నిపుణులు అంటున్నారు. మరి ఆ తప్పులు ఏంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాహార లోపాలు:
పోషకాహార లోపాల వల్ల కూడా జుట్టు రాలడానికి దారి తీస్తాయి. జుట్టు ఆరోగ్యానికి ముఖ్యంగా విటమిన్ బి అనేది చాలా అవసరం. అంతే కాకుండా మీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోండి. దీని వల్ల జుట్టు బలంగా, దృఢంగా ఉంటుంది.
ఒత్తిడి:
ఒత్తిడి వల్ల కూడా జుట్టు అనేది రాలడానికి ఒక సాధారణ కారణం. ఒత్తిడి వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఒత్తిడి వల్ల ఇతర అనారోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి పద్దతులను ఉపయోగిస్తే.. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తగ్గితే.. ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
స్టైలింగ్ టూల్స్:
హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలడం అనేది ఊడిపోతుంది.
కృత్రిమ రంగులు:
హెయిర్‌కు కృత్రియ రంగులు ఉపయోగిండం వల్ల జుట్టుకు హానికరం అవుతుంది. ఈ రంగుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జుట్టు బిరుసుగా మారి జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది.
పారెబెన్స్ ఉన్న పదార్థాలు:
చాలా మందికి తెలియకుండా జుట్టుకు పారాబెన్స్ ఉన్న ప్రాడెక్ట్స్ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలడం అనేది జరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.